టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కు అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది అనే మాట అక్షరాలా నిజం. చేసినవి పది సినిమాలు కూడా లేకపోయినా బాబు కి ఉన్న మైండ్ సెట్ అభిమానులను తెచ్చి పెట్టింది. సినిమా హిట్ ఫ్లాప్ అనే దాన్ని పక్కన పెడితే అతన్ని ప్రత్యేకంగా అభిమానించే వాళ్ళు టాలీవుడ్ లో కూడా ఉన్నారు. హీరోలు కూడా అతని ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటారని అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అతని సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి అనేది వాస్తవం. 

 

దానికి కారణం ఏంటీ అనేది ప్రత్యేకంగా తెలియకపోయినా ఒక ఫ్యామిలీ మాత్రం అతన్ని టార్గెట్ చేసింది అంటున్నారు కొందరు. ఆ ఫ్యామిలీ అతనిని ఇబ్బంది పెట్టడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఈ మధ్య అతను నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మీద కూడా తప్పుడు ప్రచారం ఆ ఫ్యామిలీ నే చేసింది అనేది టాలీవుడ్ జనాల మాట. సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీ హీరో ఒకరు ఎక్కువగా విజయ్ మీద తప్పుడు ప్రచారం చేయించారని టాలీవుడ్ జనాలు ఎక్కువగా కామెంట్ చేయడం ఆందోళన కలిగించే అంశం. 

 

తనకు ఉన్న ఫేం కొందరికి లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. కొందరు అగ్ర దర్శకులు ఆయనతో సినిమా చెయ్యాలని చూసినా సరే కొందరు అడ్డం పడ్డారని, ముఖ్యంగా ఒక స్టార్ హీరోతో ఈ మధ్య సినిమా ఒప్పుకున్న దర్శకుడు అతనితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినా సరే ఆ ఫ్యామిలీ అడ్డం పడింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఇక సోషల్ మీడియా లో కూడా అతనికి వ్యతిరేకంగా కొన్ని ఫేస్బుక్ పేజీ లు కూడా ఒక ఫ్యామిలీ ఫాన్స్ నడుపుతున్నారని, అతనికి వ్యతిరేకంగా రివ్యూలు కూడా రాయడం మొదలుపెట్టారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: