ప్రముఖ దర్శకుడు  రాజమౌళి  దర్శకత్వంలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలా అయినా విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్న రాజమౌళి ఇప్పుడు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా లో హీరోల లుక్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనే ఆసక్తి అందరిలోనూ ప్రధానంగా నెలకొంది. 

 

సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ముందు జూన్ అన్నారు. ఆ తర్వాత జులై అన్నారు. ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేస్తారని నమ్ముతున్నారు ఫాన్స్. అయితే ఈ సినిమాలో లుక్స్ మాత్రం మార్చ్ నుంచి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ముఖ్యంగా ఉగాది రోజు ఒక పోరాట సన్నివేశానికి సంబంధించిన లుక్ విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. 

 

రామ్ చరణ్ లుక్ ని మార్చ్ 27 న అతని పుట్టిన రోజున విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో ఇప్పుడు ప్రతీ వార్త కూడా ఆసక్తికరంగానే మారింది. ఈ వారం మాత్రం ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇక హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ చనిపోతాడని, ఒక పోరాట సన్నివేశంలో నదిలో జరిగే ఫైట్ లో అతను చనిపోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా ముగ్గురు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా బట్, ఒలివియా మోరిస్, శ్రేయా హీరోయిన్లు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ లు కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: