అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు ఫోటోలకు ఎలాంటి పోజులు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పటికప్పుడు వారి అందాలను స్టైల్ స్టైల్ డ్రెస్సుల్లో ప్రేక్షకులకు.. సినీ ప్రముఖుల ముందు దర్శనం ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం కొందరు హీరోయిన్లు.. యాంకర్లు ఫోటోలకు హాట్ పోజులు ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.. వాళ్ళు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పొట్టి నిక్కర్లలో కనిపిస్తూ అభిమానులు పెంచుకుంటుంటుంది ఈ భామ.. ఈ మధ్యే తన బట్టలపై మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఆమె నవ్వుతూనే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక పోతే తాజాగా ఈ భామ ఓ బ్లూ డ్రెస్ లో కనిపించి ఆహా జాన్వీ అని అనిపించుకుంటూనే.. వైట్ డ్రెస్ లో ఏంజిల్ గా కనిపించి అందరిని అలరించింది. ఆ ఫోటోలు మీరు కూడా ఒకసారి చూసేయండి.
శ్రీదివ్య.. మన తెలుగు అమ్మాయి.. తెలుసు కదా మన ఇండస్ట్రీ గురించి మన తెలుగు వాళ్ళకు పెద్దగా అవకాశాలు ఇవ్వరు అని.. అప్పుడెప్పుడో మనసారా చిత్రంలో నటించి ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో బస్ స్టాప్ సినిమాలో మెరిసిన ఈ భామ ఇప్పుడు తమిళంలో హీరోయిన్ గా మంచి రేంజ్ లో ఉంది.. అయితే ఈ భామ ఈ వారం ఓ ఫోటోను విడుదల చేసింది.. అందులో హాట్ పోజు కాదు కానీ క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది.
అనుపమ పరమేశ్వరన్.. ఈవిడ గురించి ఏం అని చెప్పేది? అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ఈమెకు అందం, వయసు, నటించే శక్తి ఉన్న టిక్ టాక్ కి పరిమితం అయ్యింది ఈ భామ. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. ఈ మధ్య హాట్ పోజ్ కాదు అని అద్భుతమైన డ్యాన్స్ వీడియోతో అభిమానులకు పిచ్చెక్కిచ్చింది అంటే నమ్మండి. ఇలా ఈ వారం ఈ బ్యూటీలు హాట్ పోజులతోనే కాకుండా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా దగ్గరయ్యింది.