ఈ వారం టాలీవుడ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే అందరికన్నా లోకి అభిమానులను సర్‌ ప్రైజ్‌ చేసిన హీరో మాత్రం ప్రభాసే. ఈ వారం ప్రభాస్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్న ప్రభాస్, నెక్ట్స్ మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్నఈ సినిమాను వైజయంతి మూవీస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

 

ఈ వారం సెంటర్‌ ఆఫ్‌ ద ఎట్రాక్షన్‌గా నిలిచిన మరో హీరో నాని. హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్న నాని ఈ వారం నిర్మాతగానూ హిట్‌ అందుకున్నాడు. విశ్వక్‌ సేన్‌ హీరోగా వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ `హిట్` సూపర్‌ హిట్ అయ్యింది. దీంతో నిర్మాతగా తొలి విజయం అందుకున్నాడు. తొలి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ! సినిమాను నిర్మించిన నాని కమర్షియల్‌ సక్సెస్‌ అందుకోలేకపోయాడు. ఇప్పుడు హిట్ సినిమాతో నాని కోరిక తీరింది.

 

గత వారం భీష్మగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్‌ ఈ వారం కూడా తన హవా కొనసాగించాడు. వరుస ఫ్లాప్‌ ల తరువాత నితిన్‌కు సక్సెస్‌ దక్కటంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న నటించింది. తెర మీద వీరిద్దరి కెమిస్ట్రీకి ఫుల్‌ మార్క్స్‌ పడ్డాయి. ఈ వారం సందడి చేసిన మరో హీరో మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌. గద్దలకొండ గణేష్‌ సక్సెస్‌ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న వరుణ్‌, తన నెక్ట్స్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. మరో హీరో రామ్‌ కూడా ఈ వారం కాస్త హడావిడి చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ తరువాత రామ్ నటిస్తున్న సినిమా రెడ్‌. రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల రిలీజ్‌ అయ్యింది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: