ఈ వారం టాలీవుడ్‌లో మేజర్‌ డెవలప్‌మెంట్స్‌ చాలానే ఉన్నాయి. అయితే అన్నింటికన్న ముఖ్యంగా ఈ వారం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు పండగ లాంటి మూమెంట్‌ ఒకటి వచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అల్లు అర్జున్‌ సూపర్‌ హిట్ సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరిగరాసి బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇన్ని సంచలనాలు నమోదు చేసిన ఈ మూవీ ఈ వారంలోనే డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో రిలీజ్‌ అయ్యింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

బాహుబలి సినిమా తరువాత ఆ చిత్రయూనిట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒకే వేదిక మీద కనిపించారు. అలాంటి ఓ అరుదైన సందర్భమే ఈ వారంలో జరిగింది. బాహుబలి హీరో ప్రభాస్‌ తప్ప మిగతా యూనిట్‌లో చాలా మంది ఈ వారం ఒకే వేదిక మీద సందడి చేశారు. నాని నిర్మాతగా విశ్వఖ్ సేన్‌ హీరోగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా హిట్. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజమౌళి, రానా, అనుష్కలు సందడి చేశారు. నాని, రాజమౌళి మధ్య రిలేషన్‌ కారణంగానే వారు ఈ వేడుకకు హాజరయ్యారు.


ఈ వారం అభిమానులను ఖుషీ చేసిన మరో బెస్ట్ మూమెంట్‌ పవన్‌ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌. లాంగ్‌ గ్యాప్‌ తరువాత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ సూపర్‌ హిట్ సినిమా పింక్‌ తెలుగు రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నాడు. హిందీలో అమితాబ్‌ పోషించిన పాత్రలో తెలుగులో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా కు లాయర్‌ సాబ్‌, వకీల్ సాబ్‌ అనే టైటిల్స్‌లను పరిశీలిస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వకీల్ సాబ్‌ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: