ఈ మధ్య కాలంలో సినిమాల కంటే బుల్లితెర పైనే ప్రేక్షకులకు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సరికొత్త ప్రోగ్రాం లతో పలు టీవీ ఛానల్లు  బుల్లితెర ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే సరికొత్త ప్రోగ్రాం లతో తెర మీదికి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఏదైనా ప్రోగ్రాం కొత్తగా వచ్చింది అంటే ఆ ప్రోగ్రాం లో యాంకర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులను అలరించాలన్న... ఆ కార్యక్రమాన్ని మళ్లీమళ్లీ చూసేలా  చేయాలి అన్న అది మొత్తం యాంకర్ చేతిలో ఉంటుంది. అందుకే ఒక ప్రోగ్రాం లో యాంకర్  ఎంతో ఇంపార్టెంట్. మరి ఈ వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో అలరించిన సూపర్ యాంకర్ ఎవరో  ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

 

 

 అనసూయ : ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించిన అనసూయ... సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ బుల్లి తెరపై మాత్రం యాంకర్ గా  ప్రేక్షకులందరినీ తన వాక్చాతుర్యంతో అలరిస్తోంది. ఇప్పటికే జబర్దస్త్ షో లో తనదైన యాంకరింగ్ తో అదరగొడుతున్న ఈ అమ్మడు... తాజాగా ప్రతిరోజూ పండగే అనే ప్రోగ్రాం తో తెర మీదికి వచ్చి మహిళ మణులను ఆకట్టుకుంటోంది. ఈ షో తో మహిళలకే కాదు బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ను పెంచుతుంది యాంకర్ అనసూయ. ఇక మరోవైపు జీ తెలుగులో గ్యాంగ్ లీడర్ అనే కామెడీ ప్రోగ్రాం లో జడ్జిగా.. డాన్స్ లతో కూడా హోరెత్తిస్తు అందరికీ ఫుల్  ఎంటర్టైన్మెంట్ పంచుతుంది ఈ అమ్మడు . అందుకే ఈ వారం సూపర్ యాంకర్ గా నిలిచింది. 

 

 

 రష్మీ : తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు... సుధీర్ తో ప్రేమాయణం అంటూ వచ్చిన వార్తలతో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో తనదైన యాంకరింగ్ తో అలరిస్తున్న ఈ అమ్మడు మరో వైపు ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ  లో కూడా టీం లీడర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో రష్మీ ఈవారం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా అలరించిన సూపర్ యాంకర్ గా నిలిచింది. 

 

 

 వర్షిని : నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షిణి  ఆ తర్వాత యాంకర్ గా మారి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. తనదైన యాంకరింగ్ తో ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు అందరిలో ప్రస్తుతం ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న  పటాస్ ప్రోగ్రాంలో  చంటి తో జోడిగా అదరగొడుతుంది ఈ అమ్మడు. మొదటి యాంకరింగ్ లో కాస్త తడబడ్డా ఆ తర్వాత మాత్రమే ప్రస్తుతం బాగా పాపులర్ అయింది అని చెప్పాలి. అయితే ఓ వైపు పటాస్ లో అదరగొడుతున్న వర్షిణి..  మరోవైపు డాన్స్ రియాలిటీ షో ఢీ లో  కూడా టీమ్ లీడర్గా ఆదికి జోడీగా అదరగొడుతూ  బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: