బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోలు, రియాల్టీ షోలు, సినిమాలు ఇలా నాన్ స్టాప్ వినోదాన్ని పంచడానికి రెడీగా ఉంటున్నాయి. ఇక ఈ వారం బుల్లితెర స్టార్ ఎవరన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఇప్పుడున్న మన తెలుగు ఛానెల్స్ లో అయితే సీరియల్స్ పరంగా స్టార్ మా వారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకునే టాప్ రెండు మూడు సీరియల్స్ వీరి ఛానెల్ నుంచే ఉండడం విశేషం. అయితే బిగ్‌బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షోను పరిచయం చేసిన స్టార్ మా మరో అల్టీమేట్ రియాలిటీ షోను మన ముందుకు తీసుకువచ్చింది.
అదేనండీ.. స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ యాంకర్ అయినటువంటి ఓంకార్ `ఇస్మార్ట్ జోడి` ఓ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసింది. యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ గేమ్ షో.. 18 వారాల పాటు.. 12 సెలబ్రెటీ జంటలకు బిగ్గెస్ట్ ఫైట్ ఉండబోతుందని వారి మాటలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతోనే అర్థమవుతోంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతోంది. అయితే ఇప్పటికే రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ షో మంచి ఆదరణ పొందుతోంది. వాస్తవానికి ఈ రోజుల్లో బుల్లి తెర, వెండి తెర అనే తేడానే లేదు. ఇంకా చెప్పాలంటే.. రోజూ కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ.. నిత్యం అలరించే బుల్లి తెర సెలెబ్రెటీస్కే క్రేజ్ ఎక్కువ.
ఇక సెలెబ్రెటీస్ గురించి, వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు అభిమానులు. అందులో భాగంగా ఈ అల్టిమేట్ రియాలిటీ షోను ముందుకు తీసుకువచ్చింది స్టార్ మా. పలు సీరియల్స్ మరియు సినీ ఇండస్ట్రీకు చెందిన మరికొందరు భార్య భర్తలతో ఓ టైటిల్ కోసం ప్లాన్ చేసిన రియాలిటీ షో ఇది. అయితే అంత మంది కపుల్స్ ఉన్నా ఓంకార్ మాత్రం ద ఎట్రాక్షన్‌గా నిలిచారు. తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. మరియు ఈ షో టీవీలోనే కాకుండా హాట్ స్టార్‌లో కూడా దూసుకుపోతోంది.