మాములుగా ఉన్న స్టార్స్ ను సూపర్ స్టార్స్ గా మార్చే దర్శకుడు ఆయన. ఇప్పుడున్న స్టార్స్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేశాడు ఈ డైరక్టర్. కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడ్డా రీసెంట్ గా ఓ సూపర్ హిట్ తో మళ్లీ ఫాం లోకి వచ్చాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనేగా మీ డౌట్ అతనే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు పూరి సినిమా అంటే లైట్ తీసుకున్నారు కాని ఇప్పుడు మళ్లీ లీగ్ లోకి వచ్చాడు పూరి. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. 

 

తన సినిమాలో కామన్ గానే హీరోలకు రౌడీ ఇమేజ్ ఉండేలా చూసుకునే పూరి ఈసారి అలాంటి పర్ఫెక్ట్ రౌడీ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ సెట్స్ మీద ఉంది. విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ కు.. పూరి మార్క్ డైరక్షన్ కలిస్తే ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించబోతున్నారు. ఈ సినిమా నుండి ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి. బైక్ మీద హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండేని ముందు ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. ఈ సీన్ చూస్తుంటే రౌడీ ఫ్యాన్స్ కు అన్నివిధాలుగా పండుగ అందించే సినిమాగా ఈ ఫైటర్ వస్తుందని చెప్పొచ్చు.

 

డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో పూరి సినిమా గురించి జాగ్రత్త పడుతున్నాడు. పూరితో సినిమా అంటే ఇదివరకు ఆ హీరోకి ఉన్న ఇమేజ్ అంతా నర్చిపోయి కొత్త ఇమేజ్ వచ్చేలా చేస్తాడు. అంతేకాదు డైలాగ్ డెలివరీ విషయంలో కూడా పూరి తన మార్క్ చూపిస్తాడు. పూరి డైరక్షన్ లో విజయ్ ని ఫైటర్ చేసిన పూరి ఈ సినిమాతో కూడా తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. మరి పూరి, విజయ్ కాంబో సూపర్ హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: