మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సమాజ హితమైన సబ్జెక్టుతో సినిమాలు తీసిన కొరటాలతో చిరంజీవి సినిమా చేస్తుండడంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా పేరును ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వర్కింగ్ టైటిల్ గా గోవిందా ఆచార్య కొనసాగుతుంది.

 

 

అయితే ఈ సినిమా అనంతరం చిరు మళయాల సినిమా అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడని తెలిసిందే. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని రామ్ చరణ్ దక్కించుకున్నాడని తెలిసిందే.. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే దర్శకుడి కోసం వేట సాగిస్తున్నారు. మొదటగా చిరు సుకుమార్ ని డైరెక్ట్ చేయమని అడిగారని సమాచారం. కానీ లూసిఫర్ సినిమాలో తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేయాల్సినవి చాలా ఉండడంతో సుకుమార్ తాను చేయలేనని సున్నితంగా తిరస్కరించాడని సమాచారం.

 

 

ఇక మరో దర్శకుడు పరశురామ్ పేరు కూడా వినిపించింది. కానీ చివరగా చిరంజీవి వివి వినాయక్ పేరును ముందుకు తెచ్చాడు. వివి వినాయక్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఈ రెండు రీమేక్ చిత్రాలే కావడం విశేషం, అందుకే ఈ లూసిఫర్ తెలుగు రీమేక్ కి కూడా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.

 

 

ప్రస్తుతం వివి వినాయక్ శీనయ్య అనే సినిమాలో హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఆ చిత్ర షూటింగ్ ముగియగానే చిరు పిలిస్తే మళ్ళీ దర్శకత్వం వైపుకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.  మరి చిరు ఎప్పుడు పిలిచి దర్శకుడిని కన్ఫర్మ్ చేస్తాడో చూడాలి. వీరిద్దరి కాంబినేషన్ కుదిరితే దర్శకుడిగా వివి వినాయక్ కి మంచి అవకాశం లభించినట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: