3 వారాల క్రితం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై ఒక సినిమా తీస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆపై నిందితుల లోని ఒకడైన చెన్నకేశవులు యొక్క భార్య రేణుకాని కలిసి ఒక అర్థగంట పాటు ఇంటర్వ్యూ చేసే కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఆమెకు కూడా దిశ నిజ సంఘటనల ఆధారంగా ఒక సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చాడు. తరువాత శంషాబాద్ పోలీస్ ఠాణా కి వెళ్లి కొంతమంది అధికారులను దిశ కేస్ గురించి అడిగి తెలుసుకున్నారు.



ఐతే ఇదంతా పూర్తయిన తరువాత నిన్న అనగా శనివారం రాత్రి దిశ సినిమా యొక్క షూటింగ్ ను ప్రారంభించాడు రామ్ గోపాల్ వర్మ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి బ్రిడ్జి కింద ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవ్వగా... అత్యాచార ఘటనపై కొన్ని అత్యంత కీలకమైన సీన్స్ ని ఇక్కడ షూట్ చేయడం స్టార్ట్ చేసారు.




ఇప్పటికే నలుగురు నీచులు దిశని తొండుపల్లి టోల్ గేట్ వద్ద రేప్ చేసిన తర్వాత ఆమెను చటాన్ పల్లి శివారులో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సన్నివేశాన్ని షూట్ చేసారు. ఆమె భౌతిక కాయాన్ని లారీలో తీసుకెళ్లడం, స్కూటీ ఆ లారీ వెనుక ఫాలో అవ్వడం, దిశని దహనం చేయడం లాంటి సన్నివేశాలను చిత్రీకరించారు.




ఇకపోతే గత సంవత్సరం నవంబరు నెలలో వెటర్నరీ డాక్టర్ దిశ ద్విచక్ర వాహనానికి పంక్చర్ చేసి, ఆపై ఆమెని మోసగించి, అపహరించి, అత్యాచారం చేసి ఆపై సజీవ దహనం చేశారు నలుగురు యువకులు. ఆ సంఘటన జరిగిన పది రోజుల్లోనే నేను తెలుగులో ఎన్కౌంటర్ లో చంపబడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలకు దారి చేసిన విషయం తెలిసిందే. మరి దిశ సినిమాని రామ్ గోపాల్ వర్మ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: