ప్రముఖ పాప్‌ స్టార్‌ లేడి గగా అంటేనే పాప్‌ గీతాలు మన కళ్లముందు కదిలే విషయం తెలిసిందే. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటూ మైకందుకుని ఉర్రూతలూరించే పాటలు పాడే ఆమె చాలా కాలం పాటు ఓ వ్యవసంతో ఇబ్బంది పడిందట. వెస్ట్రన్‌ కల్చర్‌లో భాగంగా లేడీ గగాకు ధూమపానం అలవాటైంది. అయితే  ఆ అలవాటు అలా పెరిగి పెరిగి రోజులు 40 సిగరెట్ల వరకు కాల్చేదట. అయితే తాను ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని చెప్పింది గగా, అంతేకాదు తన అభిమానులకు కూడా స్మోకింగ్‌ మానేయాలని పిలుపునిచ్చింది.


కేవలం గాయనిగానే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంది ఈ బ్యూటీ. చిన్నారుల కోసం పలు షోలు చేసింది. గతంలో ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె వారి కోసం పాటపాడింది. ఈ 33 ఏళ్ల పాప్ సంచలనం అనాథ కోసం ఎన్నో షోస్‌ ఉచితంగా చేసింది. పలు అనాథాశ్రమాలను సందర్శించిన ఆ చిన్నారులతో సరధాగా కాలం గడిపేది. వారి కోసం తన సంపాదన నుంచి డబ్బు కూడా వెచ్చించేది.

 

తాజాగా లేడీ గగా స్టూపిడ్‌ లవ్‌ సిరీస్‌లోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది. ఈ ఆల్బమ్‌ను తన సొంత నిర్మాణ సంస్థ సిక్త్స్‌ స్టూడియో ఆల్బమ్‌ బ్యానర్‌పై నిర్మించింది. మరికొన్ని ఆల్బమ్స్‌ రూపొందించేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శనలు ఇస్తోంది లేడీ గగా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“STUPID LOVE” THE NEW SINGLE & music VIDEO OUT NOW #StupidLove #ShotOniPhone

A post shared by Lady Gaga (@ladygaga) on

మరింత సమాచారం తెలుసుకోండి: