ప్రభాస్ రేంజి బాహుబలితో ఎక్కడికో వెళ్ళిపోయిందని ఎవరిని అడిగినా చెబుతారు. ఇన్నాళ్ళూ ఆ క్రెడిట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉండేది. ఇపుడు ఇతర దేశాలో కూడా మంచి ఫాన్ మెయిల్ ఉన్న ఏకైన సౌత్ హీరో ప్రభాస్. దానికి ప్రభాస్ చేసిన విలువైన అయిదేళ్ళ కాలం త్యాగం ఉంది. ప్రభాస్ తన కష్టం. టైం, మనీ అన్నీ ధారపోసి బాహుబలి చేశాడు. రెండు పార్టులూ సూపర్ డూపర్ హిట్ అయి ప్రభాస్ కెరీర్ ని టాప్ గేర్లోకి తీసుకెళ్ళాయి.

 

కనుకనే సాహో తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా హిందీలో కలెక్షన్లు కొల్లగొట్టింది. అంటే బాలీవుడ్ మార్కెట్ ప్రభాస్ కి పదిలం అన్నది మరోమారు  ప్రూవ్ అయింది. అందుకే ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీస్ కి అటు దర్శకులు, ఇటు నిర్మాతాలు సై అంటున్నారు. ప్రభాస్ తో లేటెస్ట్ గా కొత్త మూవీని అనౌన్స్ చేసిన మహానటి ఫేం డైరెక్టర్ నాగ అశ్విన్ తన కధకు ప్రభాస్ తప్ప మరెవ్వరూ సూట్ అవరంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

 

ప్రభాస్ తప్ప తన కధకు న్యాయం చేసే వారే లేరని ఈ డైరెక్టర్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. తాను సైన్స్, ఫిక్షన్ కలగలిపి కధ రాసుకున్నానని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద దాన్ని పండించేందుకు ప్రభాస్ కి మాత్రమే సత్తా ఉందని అంటున్నాడు. ప్రభాస్ వన్ అండ్ ఓన్లీ చాయిస్ అని కూడా చెబుతున్నాడు. 

 

ఇది సరే కానీ ప్రభాస్ ని అదే పనిగా పొగిడితే మిగిలిన టాలీవుడ్ హీరోలు హర్ట్ అవరా అన్నదే ఇక్కడ పాయింట్. నిజానికి మిగతా వారికి కూడా పాన్ ఇండియా మూవీ చేయాలని ఉంది. కానీ కాన్ఫిడెన్స్ చాలడంలేదు. వారికి క్రియేటివ్ డైరెక్టర్  రాజమౌళి కూడా దొరకడంలేదు. ఇపుడు ఆర్.ఆర్.ఆర్ తో చరణ్, ఎన్టీయార్ కనుక బాలీవుడ్లో బావుటా ఎగరేస్తే అపుడు మళ్ళీ కదలిక రావచ్చు. మొత్తానికి ఇప్పటికైతే ఏకైక పాన్ ఇండియా హీరో ప్రభాస్ అనే చెప్పాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: