టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటి సంపాదించుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సరే కెరీర్ తొలి రోజుల్లో చేసిన పెళ్లి చూపులు సినిమా విశేషంగా ఆకట్టుకుంది. అక్కడి నుంచి బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా అయితే అతనికి తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డిగా అతని నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

 

సినిమా తర్వాత అతను ఇక వెనుతిరిగి చూసుకునే అవసరం రాలేదు. కాని ఈ తరుణంలో వచ్చిన ఫ్లాపులు మాత్రం అతన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో నిలబడ్డాడు విజయ్. అయినా సరే అతని సినిమాలకు క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో అతనికి మంచి హిట్ వస్తుందని భావించారు అందరూ. కాని అతనికి మాత్రం సరైన హిట్ దక్కలేదు అనేది వాస్తవం. దీనితో ఇప్పుడు విజయ్ కెరీర్ మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

అతనికి కథలు ఎంపిక చేసుకోవడం రావడం లేదు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అతను సినిమాలో కాస్త వివాదాస్పద సన్నివేశాలు లేదా లిప్ లాక్ సీన్స్ ఉంటే చాలు ఓకే చేస్తున్నాడని దాని వలన అతను సరైన హిట్ కొట్టలేక అవస్థలు పడుతున్నాడని, కెరీర్ మొదట్లో ఇది ఎంత మాత్రం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెరీర్ మొదట్లో ఉన్నాడని కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక అతని సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆ అభిమానాన్ని అతను కాపాడుకోవాలి అంటే సినిమాలో కాస్త అతి లేకుండా చూసుకుంటే ఒక పద్దతిగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: