హీరోగా నాని నేచురల్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూశాం. విలన్ గా ఎలా చేశాడన్న క్యూరియాసిటీకి తెరపడింది. నేచురల్ స్టార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం వి టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు అంటూ హీరో సుధీర్ బాబుకు సవాల్ విసిరాడు నాని. 

 

అష్టాచమ్మాతో నానీని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ వి సినిమాతో విలన్ గా మార్చేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా నటించిన నాని.. ఇదే దర్శకుడు తీసిన జెంటిల్ మెన్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడే గానీ.. చివరికి హీరో అని తేల్చేశాడు. 

 

నాని విలన్ గా నటిస్తున్న వి లో సుధీర్ బాబు హీరో. దర్శకుడి ఆస్థాన హీరోయిన్  నివేద థామస్ తో పాటు.. అదితిరావ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో హీరో.. విలన్ చెప్పిన ప్రతి డైలాగ్ తో పంచ్ పేలింది. ప్రతి సినిమాకూ తనే మాటలు రాసుకునే ఇంద్రగంటి మోహన్ కృష్ణే ఈ సినిమాకు కూడా మాటలు రాశాడు. 

 

బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే.. బ్యాక్ గ్రౌండ్ మాత్రం తమన్ ఇచ్చాడు. నాని పూర్తి స్థాయి విలనిజం చూడాలంటే.. మార్చి 25 వరకు ఆగాల్సిందే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 

హీరో నాని ఇప్పటికే నేచురల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. నాని వెండితెరపై ఉన్నపుడంతా సగటు అభిమాని ఆయన్ను చూస్తూనే ఉండాల్సిందే. ఎందుకంటే నాని యాక్టింగ్ లో లీనమైపోయి కళ్లప్పగించి చూస్తుంటాడు. హీరోగా అయితే నాని మెప్పించాడు గానీ.. విలన్ గా ఆయన ఎలా ఉంటాడనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: