తమిళ దర్శకుడు, హీరో, డాన్సర్ రాఘవ లారెన్స్ 2007 నుండి 'ముని' పేరుతో హారర్ సిరీస్ సినిమాలు తీస్తూ వందల కోట్లు రూపాయలను సంపాదించాడు. 2011లో విడుదలైన ముని 2/ కాంచన సినిమా కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో వెండి తెరకెక్కినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్, టీవీ ఛానల్ కూడా ఈ సినిమాని ఎక్కువ ఖర్చు పెట్టే కొనేసాయి. దీంతో ఆ సినిమాకి దాదాపుగా పెట్టుబడి కంటే 15 రెట్ల లాభం వచ్చింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ అన్ని రాఘవ లారెన్స్ కావడంతో వచ్చిన లాభం మొత్తం అతని బ్యాంకు అకౌంట్ లోనే పడిపోయింది.




అయితే ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఒక హిజ్రా ది ఉంటుంది. ఆ హిజ్రా పాత్రని శరత్ కుమార్ చాలా బాగా పోషించారు. సెకండ్ ఆఫ్ మొత్తం హిజ్రా పాత్రలతోనే నడుస్తుంది. వాస్తవానికి వారి పాత్రలే ఈ సినిమాలో హైలెట్ అని చెప్పుకోవచ్చు. సో, ఆ హిజ్రా పాత్రల వల్లనే తాను కోట్లు సంపాదించుకున్నానని రాఘవ లారెన్స్ ఎప్పుడూ అనుకుంటారట. ఐతే ఈ కాంచన సినిమా యొక్క హింది రీమేక్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుండగా... రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ఖరారైంది. అయితే ఒకవైపు సినిమా తీసి కోట్లు సంపాదిస్తూ మరోవైపు ఎన్నో ట్రస్టులు ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు, అనాధలకు ఇంకా చాలామంది హెల్ప్ లెస్ ప్రజలకు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు రాఘవ లారెన్స్.



అయితే ఎప్పుడైతే అక్షయ్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడో... అప్పుడే తన మనసులోని మాటని అక్షయ్ కుమార్ కి చెప్పేశాడు. అదేంటంటే ఒక ట్రస్టు ఏర్పాటు చేసి చెన్నై లో ఉన్న హిజ్రాలకు ఆశ్రమాలను కట్టించాలని, దానికి తన సపోర్ట్ కావాలని అక్షయ్ కుమార్ ని అడిగాడట. ఇది విన్న అక్షయ్ కుమార్ రాఘవ లారెన్స్ గొప్ప ఆలోచన ని అభినందిస్తూ... వెంటనే చెన్నైలో ఒక హిజ్రాల ఆశ్రమం/షెల్టర్ కొరకు రూ.1.5 కోట్లు ని ఇచ్చేసాడు. దీంతో ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అలానే చెన్నై లో త్వరలోనే ఇంకా ఎన్నో ఆశ్రమాలను కట్టించి హిజ్రాలు తలదాచుకోడానికి ఏర్పాటు చేస్తామని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. ఐతే ప్రస్తుతం వీరిద్దరి గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: