సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే ఆయన ఎంట్రీ పట్ల తమిళ మీడియా వర్గాలు రకరకాల కథనాలు ప్రసారం చేసింది. బిజెపి పార్టీ తో చేతులు కలిపి రజినీకాంత్ తమిళ రాజకీయాలను శాసించే ప్లాన్ వేశారని ఇలా అనేక రకాల వార్తలు రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ గురించి తమిళ మీడియా వర్గాలు కుప్పలుతెప్పలుగా వార్తలు రాస్తున్నారు. మరోపక్క సినిమాలు చేసుకుంటూ ఉన్నా రజినీకాంత్ ఫుల్ టైమ్ రాజకీయాల్లో ఎప్పుడు వస్తారో అని రజనీకాంత్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో అడపాదడపా మీడియా ముందుకు వచ్చి అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అన్నట్టు రజినీకాంత్ కాలయాపన చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుందరరాజన్ అనే దర్శకుడు రజినీపై సంచలన కామెంట్స్ చేశాడు. జయలలిత 72వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సుందరరాజన్ అందరిపై ఫైర్ అయ్యాడు.

 

అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదని తెలిపాడు. అయితే ఎంజీఆర్ ఎప్పుడు సీఎం అయ్యాడో.. అర్హత లేని వారంతా నటనలోకి వచ్చేశారంటూ పరోక్షంగా రజినీని ఉద్దేశించి అన్నాడు.

 

అంతేకాకుండా ఎంజీఆర్ తాను నటించిన సినిమాల్లో ఎప్పుడూ కూడా విలన్లను చంపలేదని కానీ...ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను కొంతమంది హీరోలు వారి సినిమాల్లో విలన్లను దారుణంగా చంపారని అలాంటి మనుషులు ఎంజీఆర్ కూర్చున్న సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇంకా దారుణమైన వ్యాఖ్యలు రజనీకాంత్ పై చేశారు. దీంతో రజనీకాంత్ ఫాన్స్ డైరెక్టర్ సుందరరాజన్ చేసిన వ్యాఖ్యలకు మండిపడి ఆయన ఇల్లు ముట్టడించడానికి రెడీ అయ్యారు. కొంతమంది అయితే నిన్ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: