సీనియర్ జర్నలిస్టు వినాయకరావు ‘మెగాస్టార్ ది లెజెండ్’ పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్, దర్శకుడు వివి వినాయక్ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు రాఘవేంద్ర రావు... భారతం రాసినప్పుడు వ్యాసుడికి వినాయకుడు అవసరమయ్యారని... చలన చిత్ర భారతంలో హీరో చిరంజీవి గురించి రాయాలంటే ఒక్క వినాయకరావుతోనే సాధ్యమైందన్నారు. 

 

నా జీవితంలో ఎన్టీఆర్‌తో 12 సినిమాలు, చిరంజీవితో 14 సినిమా చేశానని గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి గురించి రాయాలంటే మేటర్ ఉండాలన్న ఆయన... మేటర్ లేకుండా రాస్తే పేజీ నింపడం అవుతుందని వ్యాఖ్యానించారు. సినిమా ఫీల్డ్‌లో హీరోకు, దర్శకుడికి హిట్లు, ఫ్లాపులు ఉంటాయని, ఒక సీజన్‌లో ఫ్లాప్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసేవారే గొప్ప వాళ్లు అవుతారన్నారు. నాకు వరుసగా రెండు, మూడు సినిమాలు ఫ్లాపులు వచ్చాయని, అప్పుడు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తీయాల్సి వచ్చిందన్నారు.

 

కథ సంప్రదింపులు జరుగుతున్నాయని, సినిమాలు రెండు, మూడు ఆడలేదన్నారు. ఇతనితో చేద్దామా?, వద్దా? అని అశ్వినీదత్, చిరంజీవి మాట్లాడుకున్నారని, మరి ఏమనుకున్నారో ఏమో గానీ చిరంజీవి ఒకే మాట చెప్పారని, అతిలోక సుందరిని, జగదేకవీరుడిని కలపాలంటే ఒక్క రాఘవేంద్రరావు తోనే అవుతుందని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నాపై నమ్మకం, గౌరవంతోనే చిరంజీవిసినిమా చేశారన్నారు. ఆ తర్వాత చిరంజీవితో ‘ఇద్దరు మిత్రులు’ సినిమా చేశా అని... ఆ సినిమాకు వచ్చిన లాభాలతోనే నా కూతురుకి పెళ్లి చేశా అని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అని కాదని... కరెక్ట్‌గా ‘ఇద్దరుమిత్రులు’ సినిమా సమయంలోనే అలా జరిగిందన్నారు. నా జీవితంలో మంచికి, చెడుకి మధ్య చిరంజీవి అండగా ఎప్పుడూ ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు ఏ సమస్య వచ్చినా నాకే చెబుతాడన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: