సైజ్ జీరో బ్యూటీతో టాలీవుడ్ ను షేక్ చేసిన ఇలియానాకు ఛాన్స్ లు లేకుండా పోయాయి. పాపం కొత్త అవకాశాల కోసం గోవా బ్యూటీ పడరాని పాట్లు పడుతోంది. తనలో ఇంకా గ్లామర్ డోస్ తగ్గలేదని మేకర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇల్లీ బేబీని తెగ ట్రై చేస్తోంది. మరి ఇలియానా న్యూ బికినీ ఫోజులు కొత్త అవకాశాలు తెస్తాయా..?

 

ఇలియానా ఫిగర్ చూసి టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు..మహేశ్ బాబు లాంటి స్టార్ సైతం దేవ దేవ దేవుడా అని ఓ పాటేసుకున్నాడు. అమ్మడి సైజ్ జీరో అందాలకు టాలీవుడ్ కుర్రాళ్లు దాసోహమైపోయారు. తెలుగు నిర్మాతలు అయితే ఇలియానా డేట్స్ కోసం క్యూకట్టిన సందర్భాలు అనేకం. కానీ టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కూడా. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అమ్మడు అవకాశాల కోసం నిర్మాతలను కాకపట్టే పరిస్థితి వచ్చింది. 

 

ఏ ముహుర్తాన అమ్మడు ఫారిన్ బాయ్ ఫ్రెండ్ తో లవ్వాయణం నడిపిందో కానీ అదే ఇలియనా కెరీర్ ని ట్రాక్ తప్పేలా చేసింది.హీరోయి గా రావాల్సిన స్టార్ డమ్, చేరాల్సిన హైట్స్ చేరిన ఈ బ్యూటీకి అర్థాంతరంగా ఛాన్స్ లు లేకపోవడం మాత్రం ఇబ్బందిగా మారింది. ఇల్లీబేబీలో నాజూకు తనంలో పోయి బొద్దుతనం వచ్చింది. అయితే ఇలియానాలో అట్రాక్షన్ మాత్రం తగ్గడం లేదు. ఇదే విషయాన్ని మేకర్స్ గుర్తించేలా ఇన్ స్టాలో అదరగొట్టి బికినీ స్టిల్స్ షేర్ చేసింది. 

 

తాజాగా ఇలియానా బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. గోవా బ్యూటీ హాట్ హాట్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పనిలో పనిగా ఏ దర్శక నిర్మాతనో హీరోనో ఛాన్స్ ఇచ్చి ఆడుకోబోతాడని ఇలియానా ఆశ పడుతున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి గోవా బ్యూటీ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. టాలీవుడ్ రీ ఎంట్రీలో రవితేజ మీద హోప్స్ పెట్టుకుంటే అమర్ అక్బర్ ఆంటోనీ నిరాశపరిచింది. మరి ఇలియానాకు మళ్లీ మంచి కాలం వస్తుందా లేక ఇక్కడితో రిటైర్ కావాల్సి వస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: