సినీ పరిశ్రమలో హస్య నటులంటే.. మగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. కానీ అంతేస్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సాధించిన హాస్య నటీమణులు కూడా ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి నటీమణుల్లో ఒక్కరు శ్రీలక్ష్మి.

 

ఆమె నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. 


మహిళా కమెడియన్స్ గురించి చెప్పుకోవాలంటే శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎక్కువగా జంధ్యాల సినిమాల్లో ఆమె కామెడీ చాలా బాగా పండింది. "బాబూ... చిట్టీ" అంటూ ఆమె  ప్రేమతో పేల్చిన డైలాగ్ థియేటర్లలోనూ నవ్వులు పూయించి మరీ.. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం.. ఇలా హాస్యనటులు అందరితోనూ నటించిన ఈమె దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. 

 

శ్రీలక్ష్మికి బాపుగారు ‘వంశవృక్షం’ సినిమాలో కూడా హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చిన్న చిన్న వేషాలు వేయడం మొదలుపెట్టాను. బావామరదళ్లు’, ‘నివురుగప్పిన నిప్పు’సినిమాలలో చేశారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మంచి ఫలితం దక్కలేదన్నారు. అందుకే ఆమె మళ్ళి కామెడీ సినిమాలో నటించారు. ఆమె జీవితంలో చాలా కష్టపడ్డారు. అనేక బాధలను భరించారు. జీవితం ఏడ్పించాకే నవ్వించడం మొదలు పెట్టాను అని అంటుంటారు.

 

సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందంలతో కాంబినేషన్ బాగా కుదిరేది. పెళ్లిసందడి’, ‘చాణక్య శపథం’, ‘పట్టాభిషేకం’ మరిచిపోలేని సినిమాలు. శుభలగ్నం సినిమాలో ఆమె పాడిన పాట ఇంకా అందరికి గుర్తే ఉండొచ్చు. అదేనండి శోభనం రోజున కూడా ఓ పాట పాడమంటే ‘అబ్బబ్బా దబ్బబ్బా జబ్బ’ అనే పాడతాను. అది అప్పట్లో బాగా పేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: