సినిమా ఇండస్ట్రీలో జీనియస్ అండ్ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ అంటే అది రాం గోపాల్ వర్మ మాత్రమే. ఆయన తీసిన ఒక్క శివ సినిమాతోనే ఇండస్ట్రీలో కొత్త అధ్యాయానికి తెర లేపారు. ఆ సినిమాలో వాడిన లైటింగ్, స్క్రీన్ ప్లే, కెమెరా యాంగిల్స్ ...ఇలా టెక్నికల్ గా చాలా అంశాలు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు చాలామంది దర్శకులు. ఒక రకంగా చెప్పాలంటే శివ సినిమా నవతరం దర్శకులకి ఒక రిఫరెన్స్ లాంటిది అని చెప్పాలి. అయితే వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది. ఆయన తీసే సినిమాలే ఒక సంచలనం అయితే ఆయన చేసే ప్రతీ పనీ కూడా సంచలనమే అని అందరికీ తెలిసిందే. లేకపోతే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అన్న అడల్ట్ మూవీని ఎందుకు తీస్తాడు. 

 

ఒకరకంగా చెప్పాలంటే రాం గోపాల్ వర్మ ఇంటి పేరు ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు వర్మకి ఇంటి పేరు ఒకటి కాదు రెండయిపోయాయి. అవే సంచలన దర్శకుడు, వివాదాల దర్శకుడు. ఈ పేర్లే వర్మకి ఇప్పుడు ఆస్తి పాస్తులు అన్నట్టుగా అయిపోయి. ఇక ఆయన ఈ మధ్య మరీ పైత్యం ఎక్కువైనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. హీరోయిన్స్ తో డాన్సులు, రొమాన్సులు, సక్సస్ పార్టీలలో వైన్ తాగి హీరోయిన్స్ మీద షాంపేన్ పోయడాలు ఒకటేమిటి వెకిలి చేష్ఠలు చాలానే చేస్తున్నారు. నిజానికి అటు బాలీవుడ్ లో గాని ఇటు టాలీవుడ్ లో ఆయన దగ్గర శిష్యరికం చేసి సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 

 

కృష్ణ వంశీ, పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ .. ఇలా టాలీవుడ్ లో లిస్ట్ చాలా పెద్దదే. అయితే ఆయన శిష్యులు ఎంతగా పాపులర్ అవుతున్నారో వర్మ అంతకి నాలుగింతలు ప్రేక్షకులలో జనాలలో చులకన అవుతున్నారు. అందుకు కారణం చేసే పనిని సిగ్గులేకుండా చెప్పడం. ఒక అమ్మాయితో సెక్స్ చేశానని చెప్పే విషయం గాని, పొద్దున్నే లేవగానే పోర్న్ చూస్తాననడం గాని అన్నీ విచిత్రంగా మాట్లడుతు తిక్క స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు.

 

అసలు చేస్తారా లేదా అన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. కేవలం జనాల అటెన్షన్ కోసం, క్రేజ్ కోసమే వర్మ అలా చెప్తాడు తప్ప అంత సీన్ లేదని అంటుంటారు. కానీ ఆయన తీసిన జి.ఎస్.టి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చూస్తే నిజమే ఈయన గారికి పొద్దున్నే లేచి పోర్న్ చూసే అలవాటుందని అనిపిస్తుంది. అంతేకాదు ఇస్మార్ట్ శంకర్ సక్సస్ పార్టీలో చార్మీని గట్టిగా హత్తుకొని నలిపేసి చెస్ట్ మీద ముద్దు పెట్టడం కూడా ఆయనకి ఉన్న కామ కేళిని చూపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: