ఒక‌ప్పుడు వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసి చాలా త‌క్కువ టైంలోనే పాపుల‌ర్ డైరెక్ట‌ర్ అయిన ఓ డైరెక్ట‌ర్ గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో దారుణ‌మైన జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. అంతెందుకు రాజ‌మౌళికి స‌ద‌రు డైరెక్ట‌ర్ పోటీ అన్న టాక్ అప్ప‌ట్లో ఉండేది. అలాంటి డైరెక్ట‌ర్ అప్ప‌ట్లో అగ్ర హీరోల నుంచి నేటి త‌రం యువ హీరోలుగా ఉన్న వాళ్లంద‌రితోనూ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. బాల‌య్య‌, చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, వెంక‌టేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోల‌తో మంచి సినిమాలు చేశాడు.

 

ఓ స్టార్ హీరో కొడుకుతో అత‌డు చేసిన సినిమా దెబ్బ‌తో అత‌డి పేరు ఎత్తితోనే ఇండ‌స్ట్రీ భ‌య‌ప‌డి పోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత ఓ రీమేక్ సినిమాతో హిట్ కొట్టినా ఆ సినిమా క్రెడిట్ మొత్తం హీరోకే వెళ్లిపోయింది. అస‌లు ఆ సినిమాకు అత‌డు ద‌ర్శ‌కుడు అన్న విష‌య‌మే ఎవ్వ‌రికి గుర్తు ఉండ‌దు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఓ స్టార్ హీరోతో ఓ రీమేక్ సినిమాకు అత‌డే డైరెక్ట‌ర్ అంటూ గుస‌గుస‌లు స్టార్ట్ అయ్యాయి. 

 

అంతెందుకు అస‌లు ఆ డైరెక్ట‌ర్ ఈ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయ‌లేద‌ని.. ఆయ‌న పేరు వేసుకుని ఆ హీరో కాంపౌండ్ డైరెక్ట్ చేసుకుంద‌న్న టాక్ కూడా ఉంది. త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ తీసిన సినిమా పెద్ద డిజాస్ట‌ర్ తో ఖ‌ళాఖండంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు హీరో అవ‌తారం ఎత్తాడు. ఆ సినిమా కూడా స‌గం షూటింగ్ అయ్యాక చూసుకుంటూ ఏ మ‌త్రం అవుట్ ఫుట్ బాగా లేక‌పోడంతో దానిని కొన‌సాగించాలా ?  మ‌ధ్య‌లో వ‌దిలేయాలా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. 

 

ఇక ఇప్పుడు మ‌ళ్లీ అత‌డు మ‌ళ్లీ సినిమాను డైరెక్ట్ చేస్తాడా ? అస‌లు డైరెక్ష‌న్ గుర్తుందా ? అంత స‌త్తా ఇంకా ఉంది అత‌డిలో.. ?  ఈ జెనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు సినిమా తీయగలడా అనేది కూడా అలోచించాల్సిన అంశమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  ఏదేమైనా అత‌డి ప‌రిస్థితి ఇంత‌లా దిగ‌జారిపోవ‌డం మాత్రం దారుణ‌మే అనాలి..?

మరింత సమాచారం తెలుసుకోండి: