సినిమా కాన్సెప్ట్ ఏదైనా ఆ సినిమాలో కామెడీ అనేది కంపల్సరీ. దాదాపు అన్ని తెలుగు సినిమాల్లో కామెడీ ట్రాక్‌ ఉంటుంది. మనకు ఇటీవల ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న ఒకరిద్దరిని మినహాయిస్తే దాదాపు అందరు దర్శకులు సినిమాలో ఓ సాలిడ్ కామెడీ ట్రాక్‌ ఉండేలా చూసుకుంటారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అయితే కామెడీ కంపల్సరీ. మరి ఇంత డిమాండ్ ఉందంటే ఆ కమెడియన్ల రెమ్యూనరేషన్‌లు ఎలా ఉండాలి.? అవును మన కమెడియన్స్‌ పారితోషికం విషయంలో కూడా భారీగానే వసూళు చేస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

 

ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్ రేంజ్‌లో ఉన్న కమెడియన్‌ వెన్నెల కిశోర్‌. ఫ్యామిలీ డ్రామాల నుంచి క్రైమ్ థ్రిల్లర్‌ ల వరకు ప్రతీ సినిమాలో వెన్నెల కిశోర్‌ కామెడీ కామన్‌ అయిపోయింది. స్టార్ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు ప్రతీ ఒక్కరి సినిమాలో వెన్నెల కిశోర్‌ నటిస్తున్నాడు. అందుకే ఆయన కాల్‌ షీట్ కూడా చాలా కాస్ట్‌లీ. సాధారణంగా కమెడియన్ల రెమ్యూనరేషన్‌ రోజుల లెక్కన ఉంటుంది. వెన్నెల కిశోర్‌ రోజుకు దాదాపు 5 లక్షల వరకు వసూళు చేస్తున్నాడట.

 

ఇక తెలుగు సినిమా హాస్యానికి కేరాఫ్ అడ్రస్‌ లాంటి నటుడు బ్రహ్మానందం. వేల సినిమాల్లో అద్భుతమైన హాస్యం పడించిన బ్రహ్మీ ఇటీవల కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే బ్రహ్మానందం రేంజ్ మాత్రం తగ్గలేదు. అందుకే ఆయన ఇప్పుడు కూడా భారీ పారితోషికమే వసూళు చేస్తున్నాడు. ఈ సీనియర్ కమెడియన్‌ సినిమాలో నటించాలంటే రోజుకు 6 లక్షల వరకు ఇవ్వాల్సిందే. హీరోగా ఫెయిల్ అయి తిరిగి కామెడీ బాట పట్టిన సునీల్ కూడా కామెడీ రోల్స్‌కు భారీగానే వసూళ్లు చేస్తున్నాడు. ఒక్క రోజుకు దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నాడు సునీల్‌.

 

ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న పృధ్వీ 2 లక్షలు, ప్రియదర్శి 3 లక్షలు, రాహుల్ రామకృష్ణ లక్షన్నర, పోసాని కృష్ణ మురళి రెండున్నర లక్షలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: