ఈరోజు సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ సంబంధించిన టైటిల్ ప్రకటనకు సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదల కాబోతోంది. రెండు సంవత్సరాల తరువాత పవన్ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి ప్రమోషన్ కాబట్టి ఈ మూవీ పోస్టర్ ను హైలెట్ చేస్తూ హడావిడి చేయడానికి పవన్ వీరాభిమానులు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ పోష్టర్ ఇంకా విడుదల కాకుండానే ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన పవన్ లుక్ పలానా సమయానికి వస్తుంది అంటూ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనకు సంబంధించిన పోస్టర్ పై ఇప్పుడు విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ అంతా ఎల్లో కలర్ లో ఉంది. 


పసుపు పచ్చ బ్యాక్ గ్రౌండ్ పై బ్లాక్ లెటర్స్ తో #PSPK26 అంటూ ప్రకటన విడుదల చేసారు. ఇప్పుడు ఈ విషయమై పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ప్రచారం చేసే వారికి ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ఇప్పుడు విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ తన గత జ్ఞాపకాలను మరిచిపోలేక పోతున్నాడు అంటూ కొందరు పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 


వాస్తవానికి పవన్ ఈ సినిమాలో లాయర్ గా నటిస్తున్నాడు కాబట్టి నల్లకోటుకి సింబాలిక్ గా నల్లక్షరాలు వ్రాసారు అని భావించినా అది హైలెట్ కావాలంటే తెలుపు ఎరుపు ఇలా ఏదైనా వేరే కలర్ ను బ్యాక్ గ్రౌండ్ గా వాడకుండా కేవలం పుసుపు కలర్ ను మాత్రమే ఎందుకు బ్యాక్ గ్రౌండ్ గా వాడారు అంటూ పవన్ వ్యతిరేకులు ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా కామెంట్స్ చేయడానికి చాలామంది భయపడిపోయేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోవడంతో పవన్ ను విమర్శించడానికి చాలామంది అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్న పరిస్థితులలో పవన్ ను ఇలాంటి విమర్శల నుండి రక్షించడం పవన్ వీరాభిమానులకు కూడా కష్టంగా మారింది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: