మెగాస్టార్ చిరంజీవి 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  పదేళ్ల విరామం తర్వాత ఆయన నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నారు.  అంతే కాదు పలు సినీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా వెళ్తున్నారు.  ఈ నేపథ్యంలో  'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ..   సభకు విచ్చేసిన వారు తన గురించి మాట్లాడిన విధానం చూస్తే ఇది ప్రీరిలీజ్ ఈవెంట్ లాగా లేదని, ఓ సన్మాన సభలా ఉందని చమత్కరించారు.  తనపై రాసిన పుస్తకం ఆవిష్కరించడానికి వెళ్లడానికి బదులు ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులను ఆశీర్వదించడం మంచిదని భావించానని వెల్లడించారు. 

 

తాను రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ చిత్రపరిశ్రమలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆ పదేళ్ల కాలంలో సినీ పరిశ్రమ మారిపోయిందని, కొందరు అసిస్టెంట్ డైరెక్టర్ల జీవితం నటీనటుల కారవాన్ వద్దే గడిచిపోతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు.  యువనటులు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అంటూ ఓ పిట్టకథ చెప్పారు. నేను కూడా చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో పాండీ బజార్ వైపు అస్సలు వెళ్లేవాడ్ని కాదు. అక్కడంతా నెగెటివ్ వ్యక్తులు ఉండేవాళ్లు. జీవితంలో ఎదగలేక ఫ్రస్ట్రేషన్ కు లోనైన వ్యక్తులు వాళ్లు. వాళ్ల మాటలు వింటే ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోతానేమోనని భయపడేవాడ్ని. 

 

కొన్ని ఎరియాల్లోకి మనం ఎంట్రీ ఇవ్వక పోవడం మనకు గుర్తింపు రాదు అనుకోవం తప్పుడు.. మనకు టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఏదైనా సాధించవొచ్చు.  ఈ మద్య వస్తున్న యువ నటీ,నటులు తమ సత్తా చాటుతున్నారు.  మంచి కంటెంట్ తో వస్తే.. ఆ సినిమా మంచి విజయం అందుకుంటున్నాయి.. ఈ విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ప్పుడీ యువ నటులు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు అంటూ చిరంజీవి ఆశీర్వచనాలు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: