కమల్​హాసన్​ హీరోగా ఎన్​.శంకర్​ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్​లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్​ కుప్పకూలి మీదపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డైరెక్టర్​ శంకర్​తో పాటు మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దర్శకుడు శంకర్ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ భారీ క్రేన్ పడిపోవటం ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. దర్శకుడు శంకర్ కాలు ఫ్రాక్చర్‌ అయింది. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు, సహాయ దర్శకుడు కృష్ణ, కేటరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన చంద్రన్‌ ఉన్నారు. 

 

గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడే సెట్​లో హీరో కమల్​హాసన్​తో పాటు  హీరోయిన్​ కాజల్​ కూడా ఉన్నారు.  ఈ విషయాన్ని కాస్టూమ్‌ డిజైనర్‌ అమృతరామ్‌ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘ఘోర ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. 10 సెకన్ల తేడాతో క్రేన్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాం. మీ ఆశీర్వాదాల కారణంగానే కమల్‌ సార్‌, కాజల్‌, నేను సురక్షితంగా ఉన్నాం. మేము బస చేసిన టెంట్‌పైనే భారీ క్రేన్‌ కూలిపోయింది. ఈ ఘటన తర్వాత సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై కమల్‌హాసన్‌   స్పందించారు. ‘ సెట్స్‌ లో జరిగిన ప్రమాదం మనసుని కలచివేసింది.

 

ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నోరెట్లు ఎక్కువ’  అని పేర్కొన్నారు. అంతే కాదు వారికి కోటీ రూపాయల సహాయం కూడా ప్రకటించారు.  అంతే కాదు వారి పూర్తి బాధ్యత తీసుకోవాలని.. ఇన్స్ రేన్స్ అన్ని అయ్యేలా చూడాలని లైకా సంస్థతో ఒప్పందం తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని చెప్పి ఒప్పించారు.  తాజాగా ఇండియన్-2 సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగిన ప్రమాదంపై హీరో కమల్ హాసన్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎల్లుండి సీసీబీ ఎదుట హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఆయన సీసీబీ ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: