రమాప్రభ... లేడీ కమెడియన్స్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హాస్య నటి. ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడి తో ఆమె అలరించిన విధానం ఆ నాటి ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తు ఉంది. ముఖ్యంగా రాజబాబు పక్కన ఆమె నటన ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు అనే చెప్పాలి. వాళ్ళ రోమాన్స్ కూడా అప్పట్లో థియేటర్ లో ఈలలు వేయించింది. రాజబాబు రమాప్రభ కోసం ప్రత్యేక పాత్రలను కావాలని డిజైన్ చేసుకునే వాళ్ళు దర్శకులు. రచయితలు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కథలు రాసుకునే వాళ్ళు. 

 

ఒక్క కామెడి పాత్రలే కాకుండా ఆమె కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అలరించారు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె నటన ఆకట్టుకుంది. శరత్ బాబు తో ఆమె పెళ్లి కెరీర్ ని ఇబ్బంది పెట్టినా సరే ఆమె నిలబడింది. ఆ తర్వాత కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిలబడ్డారు ఆమె. ముఖ్యంగా ఆమె గ్లామర్ కూడా అప్పట్లో హైలెట్ అయింది. సీనియర్ హీరోల పక్కన అయినా సరే ఆమె ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించే వారని చెప్తారు. 

 

ఇప్పటికి ఆమె సినిమాల్లోని కొన్ని కామెడి సన్నివేశాలు యుట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ తరం హీరోలు రవి తేజా, వెంకటేష్ వంటి హీరోల పక్కన కూడా ఆమె మెప్పించారు. రాజబాబు రమాప్రభ పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఇద్దరూ కూడా కెరీర్ లో ఎన్నో కష్టాలు పడ్డారు. సంపాదన మొత్తం పోవడం, అప్పుల పాలు అవ్వడం వంటివి వారి కెరీర్ ని మరీ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు రమాప్రభ అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనపడుతున్నారు. వయసు అయిపోయినా సరే తన పాత్రకు ఆమె న్యాయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: