ప్రస్తుతం జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని టీం లీడర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కమెడియన్ భాస్కర్. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ బుల్లెట్ భాస్కర్ గా కొసమెరుపు. తనదైన కామెడీ స్కిట్ లతో జబర్దస్త్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే స్క్రిప్ట్ రైటర్ గా నే కాకుండా మంచి కమెడియన్ గా కూడా జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ కి మంచి గుర్తింపు ఉంది. అయితే బుల్లెట్ భాస్కర్ ప్రస్తుతం జబర్దస్త్ టీం లీడర్ గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తనదైన స్కీట్లతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ కడుపుబ్బా నవ్విస్తున్న బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కి రాకముందు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. 

 

 

 బుల్లెట్ భాస్కర్ ఇండస్ట్రీకి రాకముందు జబర్దస్త్ లో అవకాశం రాకముందు రేడియో జాకీగా పనిచేసేవాడు. ఏడు సంవత్సరాల పాటు రేడియో జాకీగా పనిచేశారు బుల్లెట్ భాస్కర్. అయితే తాను రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్లో ఒక రేడియో స్టేషన్ కూడా ఉండేది కాదు అంటూ బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ రేడియో స్టేషన్ లేని సమయంలోనే వైజాగ్ లో రేడియో  స్టేషన్ ఉండేదని ఏడు సంవత్సరాల పాటు రేడియో జాకీగా పనిచేశాక కొన్ని సంవత్సరాలు రేడియో స్టేషన్ హెడ్ గా కూడా పని చేసాడు బుల్లెట్ భాస్కర్. 

 

 

 అంతేకాదండోయ్ విశాఖలో రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలోనే ఇండియా లోనే బెస్ట్ రేడియో జాకి  అవార్డు కూడా అందుకున్నాడట బుల్లెట్ భాస్కర్. ఇక ఆ తర్వాత చిన్న మిస్ కమ్యూనికేషన్ ద్వారా రేడియో జాకీగా అక్కడినుంచి మానేసి కోపంతో హైదరాబాద్ వచ్చేసాడట. అయితే తన టాలెంట్ ఏమిటో నిరూపించుకోవాలని హైదరాబాద్ వచ్చేశాడటా బుల్లెట్ భాస్కర్. ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం వచ్చిన తర్వాత తన లైఫ్ మారిపోయింది అంటున్నాడు బుల్లెట్ భాస్కర్. ఇక ఒకానొక సమయంలో తాను మానేసిన రేడియో స్టేషన్ లోకి సెలబ్రిటీ ఇంటర్వ్యూ కి వెళ్లానని దీంతో తను అనుకున్నది  అయిపోయింది అంటూ ఓ ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: