వివాదాలకు చాలా దూరంగా ఉండే మహేష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియకపోయినా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అందరు మహేష్ కు దూరం జరుగుతున్నారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో సినిమా చేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని టాక్.


గతంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ఒక గ్యాప్ దీనికి కారణం అని అంటున్నారు. అదేవిధంగా మహేష్ ను నమ్ముకుని విలువైన ఒక సంవత్సర కాలాన్ని పోగొట్టుకున్న సుకుమార్ ఇప్పట్లో మహేష్ తో సినిమాలు తీసే అవకాశం లేదు. ఇక లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి తో కూడ మహేష్ దూరం జరిగాడు. ఇక ఈ టాప్ డైరెక్టర్స్ లిస్టులో మిగిలింది కొరటాల రాజమౌళి లు మాత్రమే. 

 

రాజమౌళి మహేష్ ల మధ్య సినిమా వస్తుందని చాలామంది ఆశలు పడుతున్నా అది ఎప్పటికి వాస్తవ రూపం దాలుస్తుందో తెలియదు. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో తీస్తున్న మూవీలో మహేష్ కు ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసినా ఆ ప్రాజెక్ట్ చిరంజీవికి వెళ్ళిపోతుంది కాని మహేష్ కు పెద్దగా రాదు. ఇలాంటి పరిస్థితులలో మహేష్ వద్ద కేవలం మిడిల్ రేంజ్ దర్శకులు మాత్రమే మిగిలి ఉన్నారు. 

 

ఇక పర భాష దర్శకులు అయిన అట్లీ ప్రశాంత్ నీల్ మణిరత్నం లాంటి వాళ్ళు మహేష్ తో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నా గతంలో మురగదాస్ వ్యవహారంలో జరిగిన పరాభవంతో మహేష్ పరభాషా దర్శకులను పూర్తిగా నమ్మలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో తన దగ్గరకు వస్తున్న పరుశు రామ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ వంటి దర్శకులు చెప్పిన కథలు మహేష్ కు నచ్చినా ఫైనల్ నిర్ణయం తీసుకునే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న అనవసరంగా టాప్ దర్శకులకు తనకు తెలియకుండానే తాను దూరం అవుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: