బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ ఒక్క సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఐదు సంవత్సరాలు బాహుబలికే కేటాయించిన ప్రభాస్.. తన ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇండియా లెవెల్లో ప్రభాస్ అంతటి క్రేజ్ ఉన్న హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! బాలీవుడ్ హీరోలని మించి అభిమానులని సంపాదించుకున్నాడు ప్రభాస్. 

 

 

ప్రభాస్ రేంజ్ పెరిగినప్పటి నుండి అతడి నుండి వచ్చే సినిమాల స్థాయి కూడా బాగా పెరిగింది. అందుకే ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్లని సైతం అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. సాహో సినిమా కోసం బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ని అందుకే తీసుకున్నారు. ఇక మరో సారి ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ గురించి చర్చకి వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ కథలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని వార్త వచ్చినప్పటి నుండి ఆ సినిమాలో హీరోయిన్ ఎవరినీ తీసుకుంటారా అని సొషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

 

 

ఈ సినిమాలో కూడా మరోసారి బాలీవుడ్ భామనే తీసుకోనున్నారని ప్రచారం సాగుతోంది. దీపిక పదుకునే అయితే మరింత బాగుంటుందని సలహా ఇస్తున్నారు. కొన్ని మాధ్యమాల్లో దీపిక పదుకునే ఫిక్స్ అయిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో వాదన కూడా బయలు దేరింది. ప్రభాస్ రేంజ్ కి బాలీవుడ్ హీరోయినే కావాలా అని ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ భామ లేకపోయినా ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు.

 

 


బాహుబలిలో బాలీవుడ్ నటులు లేకపోయినా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూశాం. ప్రభాస్ రేంజ్ అని ఆలోచించకుండా కథకి ఎవరైతే సరిగ్గా సరిపోతారో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఈ విషయమై సాహో విషయంలో జరిగిన ఫలితాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: