'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఆ జాబితాలో ముందు వరుసలో కనిపించే పేరు హైపర్ ఆది అన‌డంలో ఏ మాత్రం సందేహం. ఈ షోలో పాపుల‌ర్ అవ్వ‌డం ద్వారా ఈయ‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసే పంచ్‌లకు నవ్వని వారుండరు. స్కిట్‌లో కూడా అందరికి సమ ప్రాధాన్యం ఇస్తాడు. తాను ఎదుగుతూనే తోటి ఆర్టిస్టులు కూడా ఎదగడానికి దోహదపడతాడు. హైపర్ ఆది చేసే కామెడీ స్కిట్స్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. 

 

ప్ర‌స్తుతం ఈయ‌న ఢీ ఛాంపియన్స్‌లో కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కో టీం లీడ‌ర్ అయిన సుడిగాలి సుధీర్‌ను ఎలాగైనా బీట్ చేయాల‌ని చూస్తున్నాడు. వాస్త‌వానికి ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జ‌బ‌ర్ద‌స్త్‌లో కేవ‌లం అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే రూమ‌ర్స్ రాలేదు. కానీ, ఢీ ఛాంపియన్స్‌లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో.. అప్ప‌టి నుంచి ఆదిపై ఎఫైర్ వార్తలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎందుకంటే ఢీ ఛాంపియన్స్‌లో యాంకర్ వర్షిణితో కలిసి హైప‌ర్ ఆది చేసే రొమాన్స్ అంతా ఇంతా కాదు. 

 

సాధారణంగా పులిహోర రాజా అంటే సుడిగాలి సుధీర్ గుర్తొస్తాడు. కానీ, ఇప్పుడు హైప‌ర్ ఆది  పులిహోర రాజాగా మారాల‌నుకుంటున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. గత కొన్ని వారాలుగా ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి కారణం కూడా హైపర్ ఆదే. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని హింట్లు కూడా ఇస్తున్నాడు. అలాగే ప్ర‌తి వారం ఢీ ఛాంపియన్స్‌లో రొమాంటిక్ పాటకు డాన్సులు చేసారు వర్షిణి, ఆది జోడీ. దీంతో ఇదేంపోయేకాలం.. కాంట్రవర్సీ రాజా కాస్తా పులిహోర రాజాగా మారాల‌నుకుంటున్నాడు.. అని అంటున్నారు అభిమానులు. అలాగే అది కేవ‌లం ఆన్ స్క్రీన్‌పైనే అని మ‌రి కొంద‌రు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: