కథ ఏదైన కథనం ఎలా ఉన్న సినిమాలో కామెడీ అనేది కామన్‌. ఇటీవల ప్రయోగాల బాట పట్టిన మన మేకర్స్ కామెడీని కపల్సరిగా పెట్టకపోయినా  ఒకప్పుడు సినిమాల్లో కామెడీ ట్రాక్ అనేది తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా కమర్షియల్ సినిమా అంటే కామెడీ లేకుండా అది పూర్తి కాదు. హ్యాసం కోసమే సపరేట్‌ గా ఓ ట్రాక్ రాసేవారు దర్శకులు. బ్లాక్ అండ్‌ వైట్‌ రోజుల్లో అయితే కమెడియన్‌ కూడా హీరోతో సమానంగా సినిమా అంతా కనిపించేవారు. వాళ్లకు కూడా హీరోయిన్లు ఉండేవారు.

 

అయితే ఇలా కమెడియన్లుగా సతతా చాటిన చాలా మంది బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పేరు తెచ్చుకున్నారు. హాస్యనటులుగా సత్తా చాటిన చాలా మంది నటులు రచయితలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరువాత కమడియన్లుగా సత్తా చాటారు. ఈ లిస్ట్‌ లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు పోసాని కృష్ణమురళి. రచయితగా ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలకు పనిచేసిన పోసాని తరువాత నటుడిగానూ సక్సెస్‌ అయ్యాడు. నటుడిగా వరుసగా అవకాశాలు రావటంతో రైటింగ్‌ ఆపేసిన మరి నటుడిగా కొనసాగుతున్నాడు.

 

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా ఫుల్‌ బిజీగా ఉన్న మరో స్టార్ రైటర్ తనికెళ్ల భరణి. శివ లాంటి సూపర్‌ హిట్ సినిమాకు రచయితగా పనిచేసిన తనికెళ్ల భరణి అదే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత నటుడిగా కొనసాగుతూనే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గానూ కొనసాగాడు. అయితే రైటర్‌ గా కన్నా.. నటుడిగానే ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో ఎక్కువగా నటన మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాు. అంతేకాదు శివతత్వాన్ని వివరిస్తూ ఎన్నో రచనలు చేశాడు. మిథునం లాంటి సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తనికెళ్ల భరణి. అంతేకాదు కృష్ణ భగవాన్‌, ఎంఎస్‌ నారాయణ, ఎల్బీ శ్రీరామ్‌ లు కూడా రచయితలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తరువాత నటులుగానూ సక్సెస్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: