త‌న‌దైన హాస్యంతో ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టిన హాస్య‌న‌టుడు ప‌ద్మ‌నాభం.  న‌టుడుగానే కాదు నిర్మాత‌గా కూడా రాణించి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ఆయ‌న నిర్మించారు. ఒక‌ప్పుడు ఎంత‌టి స్టార్ హోదాని అనుభ‌వించారో చివ‌రి రోజుల్లో మాత్రం అంత పేద‌రికంలో బ్ర‌తికారు. చిన్న‌త‌నంలో ఓ అంధుడి కంచంలో రాయి వేసి అందులో చిల్ల‌ర డ‌బ్బులు దొంగ‌త‌నం చేశారు ప‌ద్మ‌నాభం. పెద్ద‌య్యాక కూడా ఈ సంఘ‌ట‌న ఆయ‌న‌ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. జాత‌క‌ర‌త్న‌, బిడ‌తంబొట్టు సినిమాల్లో ఆ సీన్‌ని పెట్టి ఒక నిజ‌మైన ఒక అంధుడ్ని తీసుకువచ్చి షాట్ ఓకే అయ్యాక కొంత డ‌బ్బులు ఇచ్చి ప‌ద్మ‌నాభం పంపించారు. 

 

చిన్న‌ప్పుడు చేసిన పాప‌ప‌రిహారం లిటిల్ ఫ్ల‌వ‌ర్ అలాగే మ‌రో సంస్థ‌కు అప్ప‌ట్లోనే ఐదువేల రూపాయ‌లు విరాళంగా ఇచ్చారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి త‌నం ఎల్ల‌వేళ‌లా ప‌ని చేయ‌దు. అందులో నెట్టుకు రావాలంటే నేర్ప‌రిత‌నం అవ‌స‌రం అదిలేక‌నే చిత్తూరు నాగ‌య్య వంటి గొప్ప న‌టులు చీక‌టి రోజులు చూశారు. అందుకు ప‌ద్మ‌నాభం కూడా ఏమీ మిన‌హాయింపు కాదు. 1970లో సినిమా కోసం ఓ వ్య‌క్తికి 60వేలు అప్పు ఇప్పించ్చారు. అందుకు హామీగా దేవ‌త‌, పొట్టిప్లాడ‌ర్‌, దేవ‌త శ్రీ‌శ్రీ‌శ్రీ‌మ‌ర్యాద రామ‌న్న‌. శ్రీ‌రామ క‌థ‌ల నెగిటివ్‌ను తాక‌ట్టుపెట్టారు. 

 

ఆరునెల‌ల్లోగా అప్పుతీర్చ‌కుంటే ఆ సినిమా హ‌క్కులు ఆయ‌న ప‌ర‌మ‌వుతాయ‌న్న‌ది అగ్రిమెంట్  గ‌డువులోగా ప‌ద్మ‌నాభం అప్పుతీర్చ‌లేక‌పోయారు. దాంతో ఆ సినిమా హ‌క్కులు స‌ద‌రు వ్య‌క్తి ఆంధ్రా, నైజాం ఏరియాల‌కు 2.5 ల‌క్ష‌ల‌కు పైగా అమ్మేశారు. అప్పుతీర‌గా మిగ‌తా డ‌బ్బు ప‌ద్మ‌నాభంకి ఇవ్వ‌లేదు. పైగా సినిమా నెగిటివ్‌లు కూడా వాప‌స్ ఇవ్వ‌లేదు. 1983 వ‌ర‌కు ఈ కేసే కోర్టులో న‌డిచింది కానీ ప‌ద్మ‌నాభంకి మాత్రం న్యాయం జ‌ర‌గ‌లేదు. ఇక గోరుచుట్టు మీద రోక‌లిపోటులాగా సినిమా అవ‌కాశాలు కూడా నెమ్మ‌దిగా త‌గ్గుతూ వ‌చ్చాయి. చివ‌రికి మ‌ర‌ణించాక వారి కుటుంబ స‌భ్యులు ల‌క్ష రూపాయ‌లు తీసుకుని నెగిటివ్‌లు ప‌ద్మ‌నాభానికి ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: