న‌టుడుగా ఎంత గొప్ప న‌టులో ఓ పాత్ర చేయ‌డం ద్వారా ఆయ‌న ఆ పాత్ర‌లో లీన‌మ‌యి. ఎంత ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు కాబ‌ట్టి బ‌హుశా అది చిల్ల‌ర‌కొట్టు చిట్టెమ్మ అనే పాత్ర‌లో ఒక న‌పుంశ‌క పాత్ర‌లో  చేశారు కాబ‌ట్టి నిజంగా ప్ర‌జ‌లు ఆ పాత్ర త‌ర్వాత ఆయ‌న ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి చేసినంత అద్భుతంగా న‌టించినందుకు దాని త‌ర్వాత ఆయ‌న‌ను మాడా మాడా అనేవారు. నిజంగా ఆయ‌న ఎంత గొప్ప న‌టులు అన్న‌ది ఆ ఒక్క పాత్ర‌లో ప్రూవ్ చేసింది. దాని త‌ర్వాత ఆయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించారు. అలాగే మాడాగారిలోని ఇంకో కోణం వెంక‌టేశ్వ‌ర‌రావుగారి ప్ర‌జా నాట్య మండ‌లి త‌ర‌పున స‌మాజాన్ని చైత‌న్యవంతం చేసే ఎన్నో నాట‌కాల్లో పాల్గొన్నారు.

 

చివ‌రి ద‌శ‌లో కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న తుది శ్వాస అపోలో ఆసుప‌త్రిలో విడిచారు. ఆయ‌న దాదాపు 300ల‌కు పై చిత్రాల్లో న‌టించారు.  `చూడు పిన్న‌మ్మ పాడు పిల్లాడు` పాట‌తో పెద్ద ఎత్తులో పేరు తెచ్చుకున్నారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కుటుంబానికి ఆయ‌న ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు. ఎంత మంది క‌మెడియ‌న్లు వ‌చ్చినా కూడా ఆయ‌న్ను రీప్లేస్ చేసే క‌మెడియ‌న్లు అయితే మాత్రం అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎవ్వ‌రూ రాలేద‌నే చెప్పాలి. మాడాగారిలాగా ఆర్టిస్ట్ మాత్రం మ‌ళ్ళీ పుట్ట‌లేదు. రావుగోపాల్‌రావుతో ఆ పాత్ర‌లో న‌టించిన‌ప్పుడు ఆయ‌న‌కి సాటిగాని పోటీగాని ఎవ్వ‌రూ రాలేదు. ఆయ‌న సినీ ప్ర‌స్థానం చాలా వ‌ర‌కు మ‌ద్రాసులో ప్రారంభ‌మై హైద‌రాబాద్ వ‌ర‌కు కొన‌సాగింది. 

 

ఎప్పుడూ నార్మ‌ల్‌గా మాట్లాడుతున్న‌న‌ప్పుడు కూడా అంద‌ర్నీ న‌వ్విస్తూ ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఉండేవారు. ఓసారి ఓ సంద‌ర్భంలో సాయికుమార్‌కి ఫోన్ చేసి నీ గురించి బ్యాడ్ టాక్ వ‌స్తుంది ఇండ‌స్ట్రీ నుంచి అన్నార‌ట‌. ఏంటి ఏమ‌యింది అని ఆయ‌న అడ‌గ‌గా నువ్వు యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నావ‌ట‌. దాని గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు కాస్త యాక్టింగ్ త‌గ్గించు అంటూ  ఆ ర‌క‌మైన కామెడీతో అంద‌ర్నీ న‌వ్వించేవారు ఆయ‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: