తెర పై తాను క‌నిపిస్తే చాలు జ‌నానికి కితకిత‌లు పుట్టేవి. త‌న‌దైన హాస్యంతో తెలుగువారిని విశేషంగా అల‌రించిన రాజిబాబు రెండు ద‌శాబ్దాల‌కు పైగా సినీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన హాస్య‌న‌టుడు రాజిబాబు. ఆయ‌న న‌టించిన 20ఏళ్ళ‌లో 500 సినిమాల్లో కినిపించ‌డం ద్వారా స‌రికొత్త రికార్డు ఆయ‌న సృష్టించారు. అందుకుగాను ఆయ‌నకు ప‌ధ్నాలుగు ఫిలింఫేర్ అవార్డులు వ‌రుస‌గా 13 సంవ‌త్స‌రాలు అందుకున్న ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కింది. అప్ప‌ట్లో రాజిబాబు త‌ప్పించి మ‌రొక క‌మెడియ‌న్‌ని అంగీక‌రించ‌ని కాలం అప్ప‌టిది 1970,80. 1920లో అప్ప‌ల‌రాజుగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన ఆయ‌న చిన్న‌ప్ప‌టి నుండి హాస్య‌బాటే మండ‌పేట స్కూల్లో చ‌దువు సాగిస్తున్న రోజుల్లో బుర్ర‌క‌థ‌, హ‌రిక‌థ‌ల‌తో న‌వ్వులు పండించ‌డం ప్రారంభించారు. తెలుగు పండిట్‌గా ప‌నిచేసిన రోజుల్లో స్థాయి పెంచారు. 

 

ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లో మెడిక‌ల్ రిప్ర‌జంటేటివ్‌గా మందులు అమ్మిన‌ప్ప‌టికీ అస‌లు ఆనందం మాత్రం న‌వ్వుల్లోనే ఉంద‌ని గ్ర‌హించి ఉచితంగా న‌వ్వులు పండించ‌డం ప్రారంభించారు. స్టేజ్ మీద పూయిస్తున్న న‌వ్వుల పువ్వుల‌ను వెండితెర మీద విస్త‌రించ‌వ‌ని ఆహ్వానం అందుకుని మ‌ద్రాస్ చేరిన ప్రారంభ దినాల‌లో అవ‌కాశాలు రాక‌. ఆక‌లి క‌డుపు నింపుకోవ‌డానికి ట్యూష‌న్స్ చెప్పుకుంటూ బ్ర‌తికారు రాజ‌బాబు. ఐదు రూపాయ‌లు స‌హాయం కోసం  గంట‌ల త‌ర‌బ‌డి టి న‌గ‌ర్‌లో నిల‌బ‌డిన  రోజులు ముందు నుంచే ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌రీదైన కార్‌ల‌లో తిరుగుతూ ఆ విష‌యాల‌ను గుర్తు చేసుకుంటూ క‌న్నీరు పెట్టుకున్న మ‌న‌స్కుడు రాజాబాబు. త‌న‌లాగా క‌ష్టాలు ప‌డుతున్న చాలా మందిని ఆదుకున్న మ‌హానుభావుడు. ఆక‌లి అన్న‌వారికి జేబులో ఉన్నది అలా తీసిఇచ్చేవారు. 

 

త‌న సొంత డ‌బ్బుల‌తోనే 52 మందిని చ‌దివించి గ్రాడ్యువేట్స్‌ని చేశారు. 72 మందికి త‌న సొంత ఖ‌ర్చుల‌తో పెళ్ళిళ్ళు చేసిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కే ద‌క్కుతుంది. రాజ‌మండ్రిలో ఓ కాల‌నీని అలాగే ఓ కాలేజ్‌ని త‌న పేరుతో నిర్మించిన మ‌హాన‌టుడు. నాటి టాప్ హీరోల‌తో స‌మానంగా రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న క‌మెడియ‌న్ అని చెప్పాలి. హీరోల డేట్స్ తీసుకునే ముందు రాజ‌బాబు డేట్స్ ఉన్నాయా లేదా అని క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: