తెలుగు ఇండస్ట్రీలోకి ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నిఖిల్ సిద్దార్థ.  ఆ తర్వాత సోలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు.  ఇక నిఖిల్, కలర్స్ స్వాతి కాంబినేషన్ లో వచ్చిన ‘స్వామిరారా’ చిత్రంతో సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే ‘కార్తికేయ’ మరో సూపర్ హిట్ సాధించింది.  ఇలా వరుసగా నిఖిల్ విజయాలు అందుకుంటూ వచ్చాడు.  గత ఏడాది అర్జున్ సురువరం చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు.  ప్రస్తుతం సీక్వెల్ జమానా నడుస్తున్న నేపథ్యంలో ‘కార్తికేయ’ చిత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 

 

తాజాగా చందూ మొండేటి - నిఖిల్ కాంబినేషన్లో  ‘కార్తీకేయ2’ రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అప్పట్లో కార్తికేయుడి ఆలయం నేపథ్యంలో సాగిన కథాకథనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ చిత్రానికి  సీక్వెల్ గా 'కార్తికేయ 2'ను రూపొందించడానికి చందు మొండేటి - నిఖిల్ రంగంలోకి దిగారు. ఈ చిత్రం ఒక కాన్సెప్ట్ వీడియోను వదలగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం .. ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి సాగించే అన్వేషణగా ఈ కథ నడవనుందని తెలుస్తోంది.

 

స్వార్థానికి ఒకరు .. సాధించడానికి ఒకరు .. మంచి సంకల్పానికి సాయం చేసిన దెవరు? అంటూ సాగిన ఈ వీడియో టీజర్, కథా వస్తువుపై అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఈ వీడియో కెమెరా వర్క్ కూడా చాలా అద్బుతంగా ఉందని అంటున్నారు.  చిన్న బిట్ ఈ రేంజ్ లో ఉంటే ఇక ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆడియన్స్.  మొత్తానికి అర్జున్ సురువరం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: