మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఎంత గౌరవమో ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. మొన్న హీరో కార్తికేయ, నిన్న బ్రహ్మాజీ, ఉత్తేజ్.. ఇలా ఎంతో మంది ఎన్నో వేదికలపై చిరంజీవి తమకు ఎంత ఇన్ స్పిరేషనో చెప్తూంటారు. కానీ.. చిరంజీవి ఈమధ్య చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు కొందరిని బాధిస్తున్నాయని చెప్పాలి. పైకి వారు చెప్పుకోకపోయినా చిరంజీవి నోరు జారడంతో ఆయా సినిమాలకు స్వయంగా లీకులు ఇస్తూ చిరంజీవి తనకు తాను తక్కువ చేసుకుంటున్నారు.

 

 

ఓ పిట్టకథ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. మాటల మధ్యలో నోరు జారీ తాను చేస్తున్న 152వ సినిమా టైటిల్ ఆచార్య అని చెప్పేశారు మెగాస్టార్. ఒక్కసారిగా ఆడిటోరియం ఈలలు కేకలుతో దద్దరిల్లిపోయినా చిరంజీవి చేసిన తప్పుకు ఆయనే షాక్ కు గురయ్యారు. ‘అయ్యో.. శివ పెద్ద ప్లాన్ వేసి టైటిల్ అనౌన్స్ చేద్దామనుకుంటే తాను నోరు జారి చెప్పేశాను.. సారీ కొరటాల శివ గారూ..’ అని వివరణ ఇచ్చుకున్నారు. గతంలో కూడా రంగస్థలం ప్రీరిలీజ్ వేడుకలో సెకండాఫ్ లో ఆది చనిపోతాడని రివీల్ చేసేశారు చిరంజీవి. దీంతో సుకుమార్, మైత్రీ వారు ఇబ్బంది పడ్డారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి కీలక పాయింట్ చెప్పేశారు.

 

 

ఇవన్నీ చిరంజీవి నోరు జారి చెప్పేసినవే. ‘చిరంజీవి అనుభవం ఎంత గొప్పదో అని అందరూ పొగుడుతుంటే బాస్ మాత్రం అన్నీ రివీల్ చేసేస్తున్నారు’ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లోసినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అంటే ఎంత కార్యక్రమమో తెలిసిన విషయమే. కానీ చిరంజీవి ఆ మజా, కిక్ లేకుండా చేసేశారు. ఇకనైనా మెగాస్టార్ ఆచితూచి మాట్లాడాలని అభిమానులతో సహా అందరూ కోరుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: