వెంకటేష్ సినిమా వస్తుంది, చిరంజీవి సినిమా వస్తుంది, రవితేజా సినిమా వస్తుంది, మహేష్ బాబు సినిమా వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది, మోహన్ బాబు సినిమా వస్తుంది... ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా టాలీవుడ్ అగ్ర హాస్య నటుడు బ్రహ్మానందం లేకుండా ఏ సినిమా ఉండేది కాదు. ఆ సినిమాలు వస్తున్నాయి అంటే బ్రహ్మీ కామెడి ఏ విధంగా ఉందీ అనే ప్రశ్నలే వినపదేవి. ఆయన పాత్ర ఏంటీ ఆయనకు ఇచ్చిన రోల్ ఏంటీ అనేదే. ఆయన కోసం సినిమాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు.

 

ఆయన నటిస్తే ఆ సినిమాకు నష్టాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని టాక్. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు కనుమరుగు అయిపోయారు. ఆయన ఎప్పుడో ఒక సినిమాలో మినహా పెద్దగా కనపడటం లేదు కూడా. అసలు దీనికి కారణం ఏంటీ...? ఆయనను ఎందుకు దర్శక నిర్మాతలు పక్కన పెట్టారు...? దీనికి ఇద్దరు నిర్మాతలు కారణమని అంటారు. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన స్టార్ హీరో గారి సినిమాలో బ్రహ్మీని అడగగా ఆయన పెద్ద హీరో కాబట్టి తన పాత్ర ఎక్కువగానే ఉంటుంది కాబట్టి భారీగా డిమాండ్ చేసారు. 

 

అప్పుడు ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా బ్రహ్మీ వెనక్కు తగ్గలేదు. దీనితో అక్కడి నుంచి కొందరు కమెడియన్స్ ని పైకి తీసుకురావడం మొదలుపెట్టారట. వారిలో సప్తగిరి కూడా ఒకడు. సప్తగిరిని హడావుడిగా కొన్ని సినిమాలకు పరిచయం వాటిల్లో కీలక పాత్రలు వేయించి బ్రహ్మీని పక్కకు తప్పించే ప్లాన్ వేసారు కొందరు. అలా బ్రహ్మీ సినిమా నుంచి దాదాపుగా దూరం అయ్యారని అంటారు కొందరు. చాలా సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరం అయ్యాయి అని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఆ ఇద్దరు నిర్మాతలే అని సినీ వర్గాల టాక్. ఇక బ్రహ్మీ ప్రస్తానం దాదాపుగా ముగిసినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: