సినిమా ఇండ‌స్ట్రీ అనే రంగుల ప్ర‌పంచ‌లంలో ఎన్నో చిత్రాలు.. విచిత్రాలు జ‌రుగుతుంటాయి. ఇక్క‌డ‌ ఓడ‌లు బండ్లూ అవుతాయి.. బండ్లు ఓడ‌లూ అవుతాయి. ఇక ఇటీవ‌ల కాలంలో కమెడియన్లు హీరోలుగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే గ‌తంలో కొంద‌రు హీరోలుగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని.. ఆ త‌ర్వాత అనుకోని ప‌రిస్థితుల్లో క‌మెడియ‌న్లుగా మారిన వారూ ఉన్నాయి. అందులో చంద్రమోహన్‌, సుధాకర్‌ లాంటి వాళ్లు ఇంకా ప్ర‌త్యేకం. హీరోగా కెరీర్ మొదలెట్టి, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ తన ప్రస్దానం కొనసాగిస్తున్న నటుడు చంద్రమోహన్. ఏ పాత్రని అయినా అవలీలగా అవపోసిన పట్టి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ఆయనకు ఆ తరం నుంచి ఈ తరం దాకా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

 

బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘రంగులరాట్నం’ సినిమా ద్వారా హీరోగా చంద్ర మోహన్ సినీ రంగ ప్రవేశం చేశారు. 21 సంవత్సరాల వయసులో తొలి సినిమాతో పరిశ్రమలో ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. ఆ సినిమా బంగారు నంది అవార్డుతో పాటు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశారు. అప్పట్లో చంద్రమోహన్ పక్కన నాటిస్తే అగ్ర హీరోయిన్ అవుతారనే సెంటిమెంట్ ఉండేది. అయితే కాల‌క్ర‌మేనా సహనాయకుడిగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండేలా చేశారు.

 

ఇక సుధాకర్ గురించి చెప్పుకుంటే..  నటుడిగా, హాస్య నటుడిగా  తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మ‌రియు కొన్ని సినిమాల‌ను నిర్మించారు కూడా. దక్షిణాది చిత్రపరిశ్రమపై తనదైన శాశ్వతముద్ర వేసిన భారతిరాజ రూపొందించిన సినిమాల్లో ఒకటి `కిళకు పోగుం రైల్`. తెలుగులో వన్‌ఆఫ్ ది బెస్ట్ కమేడియన్ బేతా సుధాకర్ హీరోగా నటించిన తొలిసినిమా ఇది. ఈ సినిమాతో తమిళంలో స్టార్ అయ్యాడు సుధాకర్. ఎన్నో మలుపులు తిరిగిన సుధాకర్ కెరీర్‌లోని తొలిమెరుపు ఈ సినిమా అని చెప్పాలి.

 

యాక్టింగ్ స్కూల్‌లో చిరంజీవికి బ్యాచ్‌మేట్, మద్రాస్‌లో ఇంకా మెగాస్టార్ కాని చిరంజీవికి రూమ్‌మేట్ అయిన సుధాకర్‌కు మొదటి అవకాశం ఇది. ఈ సినిమాతో అతడి దశ తిరిగి పోతుందనుకొన్నారంతా. నిజంగానే తిరిగింది. ఈ సినిమా సీరియస్ కాన్సెప్టే అయినా.. చూస్తున్నంత సేపూ అహ్లాదకరంగా సాగుతుంది. అందుకే ఈ చిత్రం తమిళనాడులోని కొన్ని సెంటర్లలో 364 రోజుల పాటు ఆడింది. ఇదే ఊపులో సుధాకర్ దాదాపు 40 తమిళ సినిమాలు చేశారు. వాటిలో మెజారిటీ సినిమాలు హిట్స్, సూపర్ హిట్సే. అయితే కొన్ని అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల తెలుగు ఇండ‌స్ట్రీలో కమెడియన్‌గా సెటిలయిపోయారు.
  
  

మరింత సమాచారం తెలుసుకోండి: