కోటా శ్రీనివాసరావు, స్టేజి ఆర్టిస్ట్ గా, కీలక నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా ఆయన చేయని పాత్రలు ఆయన నటించని సినిమాలు లేవు. అసలు కోటాకు చిన్న పాత్ర అయినా సరే లేకుండా సినిమా ఉండేది కాదు. అతడు సినిమా చూసే ఉంటారు కదా...? ఆ సినిమాలో కోటా చేసిన కామెడి చాలా తక్కువ. కాని ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు, ఆయన హావ భావాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. మామగారు అనే సినిమా చూడకపోతే చూడండి... ఆ సినిమాలో కోటా నటనకు వందకు రెండొందల మార్కులు వేయడం ఖాయ౦. 

 

అహ నా పెళ్ళంట సినిమాలో ఆయన నటనకు ఫిదా అయిపోయింది టాలీవుడ్. అసలు ఆయన అవతారమే ఒక కామెడి. ఆయన మాట్లాడిన మాటలు ఆయన చూసిన చూపు, ఆయన నవ్విన నవ్వు, బ్రహ్మీ పక్కన ఆయన నటన... ఇలా ఆ సినిమాలో ఆయన కామెడికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే అవుతుంది. ఆయన విలన్ పాత్రలో అయినా సరే అలా ఒదిగిపోతూ ఉంటారు. ఆ పాత్రలో కూడా ఆయన కామెడి పండించడం ఆయన సొంతం. ఎందరో నటులకు ఆయన గురువు. 

 

అందుకే కోటా కామెడి అనగానే ఒక ప్రత్యేక గుర్తింపు. ఆయన నటన అనగానే ఒక హుషారు. దర్శకులు కూడా ఆయన నటన చూసి నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి. ఆయన కోసం ప్రత్యేక పాత్రలు డిజైన్ చేయడం, ఆ పాత్రలకు ఆయన మినహా ఎవరూ సరిపోరు అనే విధంగా ఆయన నటించడం అన్నీ కూడా హైలెట్ గానే నిలిచాయి. కోటా ను చూసి ఈ రాజకీయాల్లోకి వస్తే బలే ఉంటది అనుకున్నారు కొందరు. ఆయన రాజకీయాల్లో ఎక్కువ కాలం రాణించలేదు. ఏది ఏమైనా సరే ఆయన రేంజ్ మాత్రం ఎవరూ అందుకోలేరు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: