టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి కమెడియన్‌గా, విలన్‌గా ఎన్నో విలక్షణ పాత్రల్లో అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఈ సీనియర్‌ నటుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాయలసీమా యాసతో కామెడీ పండించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 

 

అలాంటి ఈ కమెడియన్ వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఈయన వయస్సు అక్షరాలా 74 సంవత్సరాలు. కానీ మనిషి చూస్తే అలా కనిపించడు కదా! కానీ అతని వయసు 74 ఏళ్ళు.. ఇప్పటికి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జయప్రకాశ్ రెడ్డి. ఇకపోతే అయన ఈ వయసులో ఓ పని చేస్తున్నారు.. అదేంటో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు.. 

 

 

అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. అయన ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇన్నాళ్లు కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన అయన త్వరలో జయప్రకాష్ రెడ్డి హీరోగా కనిపించనున్నారట.. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాశ్ రెడ్డి కనిపించనున్నారు అని గత సంవత్సరం వార్తలు వచ్చాయి. 

 

అయితే అలెగ్జాండర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహిస్తున్నారు. కథా కథనాలు నచ్చి జయప్రకాష్‌ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు అని.. అయితే ఆ సినిమాకు షూటింగ్ కూడా పూర్తి అయ్యింది అని త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదిని ప్రకటించేందుకు చిత్రయూనిట్ రెడీ అయినట్టు గత సంవత్సరం వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆ సినిమా ఇంతవరుకు విడుదల అవ్వలేదు.. మరి ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: