లెజెండరీ ఫిలిం మేకర్‌ స్టీవెన్‌ స్పీల్‌ బర్డ్‌ కూతురి ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పోర్న్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్న మికేలా అందరికీ షాక్‌ ఇచ్చిన సంగతి తెలసిందే. పోర్న్‌ స్టార్‌గా ఎదగాలన్నది తన కల అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని ఆమె బహిరంగంగా ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. మికేలా మీద గృహ హింస కేసు నమోదైంది.

 

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, నాష్ విల్లేలో ప్రియుడితో కలిసుంటున్న ఆమెను శినవారం పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలు చేయబోతున్ననంటూ ప్రకటించిన తర్వాత మికేలాతో ఆమె చుట్టు పక్కల ఉండేవారు కాస్త ఇబ్బంది కరంగా ప్రవర్తిస్తున్నారట. దీంతో ఆమెలో కోపం ఆవేశం బాగా పెరిగిపోయాయని, దీంతో తరుచూ వారితో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంద. ఆ కోపంలోనే ఆమె గృహ హింసకు కూడా పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.


దాదాపు ఆమెను 12 గంటలపాటు స్టేషన్ లోనే ఉంచారని, తరువాత బెయిల్ పై విడుదల చేశాసినట్టుగా స్థానికులు వెల్లడించారు. మికేలా అరెస్టును ఆమె బాయ్‌ ఫ్రెండ్ చక్ పాంకోవ్(50) కూడా ధృవీకరించారు. వెయ్యి డాలర్ల పూచికత్తుపై ఆమెకు బెయిల్‌ మంజూరు చేసినట్టుగా ఆయన తెలిపారు. తన తండ్రి లెజెండరీ దర్శకుడు స్పీల్‌ బర్గ్‌  అనుమతితోనే పోర్న్ రంగంలోకి వచ్చానని ప్రకటించిన మికేలా.. ఈ వారంపాటు పలు సెక్స్ వీడియోల్లో నటించింది. అంతేకాదు తనకు వయసు మళ్లీన వాళ్లతో సెక్స్‌ ఇష్టమని చెప్పిన మికేలా, వీడియోల్లో మాత్రం సింగిల్‌గానే కనిపిస్తానని వెల్లడించింది. మికేలా అరెస్ట్‌ పై ఆమె తండ్రి స్పీల్ బర్గ్‌ ఇంకా స్పందించలేదు. అయితే మికేలా స్పీల్‌ బర్గ్‌ సొంత కూతురు కాదు చాలా ఏళ్ల కిందట వారు మికేలాను దత్తత తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: