టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వ‌రుస హిట్ల‌తో తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజ‌య్ స్టైల్‌, డైలాగ్ డెలివ‌రీ అంటే యూత్ ప‌డి చ‌చ్చేవాళ్లు. అలాంటి విజ‌య్ కెరీర్ కేవ‌లం రెండేళ్ల‌లోనే రివ‌ర్స్ అయ్యింది. ఇప్ప‌టికే మూడు వ‌రుస ప్లాప్ సినిమాల‌తో విల‌విల్లాడుతోన్న విజ‌య్ తాజా చిత్రం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌. భారీ బ‌డ్జెట్... న‌లుగురు హీరోయిన్లు... కావాల్సినంత రొమాన్స్ అంటూ ఏకంగా రు. 31 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో థియేట‌ర్ల‌లోకి దిగిన ఈ సినిమా ఏకంగా రు. 20 కోట్ల పై చిలుకు భారీ న‌ష్టాల‌తో ప్లాప్ అయ్యింది.



విజ‌య్‌ను న‌మ్మి భారీగా ఖ‌ర్చు పెట్టిన నిర్మాత కేఎస్‌. రామారావు ఘోరంగా న‌ష్ట‌పోయారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్‌కు స్వేచ్ఛ ఇవ్వ‌కుండా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌, క‌థ‌నాల్లో వేలు పెట్టి పూర్తిగా కెలికేయ‌డం కూడా సినిమా ఇంత ఘోరంగా ప్లాప్ అవ్వ‌డానికి మ‌రో కార‌ణ‌మ‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్ దేవరకొండ కెరీర్ ను షేక్ చేసింది.



సినిమా ప్లాప్ అయ్యాక ఓ సినిమాను కూడా అతడు వదులుకోవాల్సి వచ్చింది. అత‌డికి అడ్వాన్స్‌లు ఇచ్చి భారీ బ‌డ్జెట్ పెట్టి సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న ముగ్గురు అగ్ర నిర్మాత‌లు అత‌డితో సినిమా ఎందుకురా బాబు రిస్క్ అనే కాడ‌కు ప‌రిస్థితులు దిగ‌జారిపోయాయి. ఇదంతా విజ‌య్ స్వ‌యం కృతాప‌రాథ‌మే అనేవాళ్లు ఇండ‌స్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారు. మితిమీరిన యాట్టిట్యూడ్‌, క‌థ‌లో వేలు పెట్టి కెలికేయ‌డం.. చివ‌ర‌కు డైరెక్ష‌న్ లో కూడా జోక్యం చేసుకోవ‌డం లాంటి కార‌ణాల‌తోనే విజ‌య్ వ‌రుస పెట్టి ప్లాపులు ఇస్తున్నాడ‌ని అంటున్నారు.



రెండు మూడు వ‌రుస హిట్లు రావ‌డం.. అవ‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో విజ‌య్ ప్ర‌వ‌ర్త‌న‌లో కూడా పూర్తిగా మార్పు వ‌చ్చిందంటున్నారు. మళ్లీ విజ‌య్ తిరిగి నేల‌మీద‌కు వ‌చ్చే వ‌ర‌కు అత‌డికి ఈ క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. విజ‌య్ మార‌క‌పోతే అత‌డి కెరీర్ మ‌రింత డేంజ‌ర్‌లో ప‌డ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: