టాలీవుడ్లో ఈ ఏడాది ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయ్యాయి. జనవరి నెలలో సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠ పురం లో... సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇక ఫిబ్రవరి నెల మొత్తానికి నితిన్ నటించిన భీష్మ‌ సినిమా ఒకటి మాత్రమే హిట్ అయ్యింది. నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో మార్చి నెల పెద్ద షాకింగ్ గా కనిపిస్తోంది. మార్చి నెలలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు. దీనికి తోడు పరీక్షల సీజన్ కావడంతో పాటు... ఐపీఎల్ కూడా ప్రారంభం అవుతుండ‌డంతో మార్చి నెల అంతా థియేట‌ర్లు బోసిపోనున్న‌యి.



మార్చి చివ‌ర్లో మాత్ర‌మే నాని - సుధీర్ బాబు న‌టిస్తోన్న వి సినిమా కాస్త మంచి అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మార్చి  6న పలాస 1978.. ఓ పిట్ట కథ.. అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి సినిమాలు  ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు ఇప్పటివరకూ సరైన ప్రచారం కూడా లేకపోవడంతో? ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయా? అన్న సందేహం కల్గుతుంది. అస‌లు చాలా మంది ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాలు ఉన్నాయ‌న్న విష‌యం కూడా తెలియ‌దు. రాజ‌శేఖ‌ర్ సినిమా లైన్లో ఉన్నా దాని గురించి కూడా ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.



ఇక థియేటర్లు ఖాళీగా లేకుండా ఏదో సినిమా ఆడించాలి కాబట్టి రిలీజ్ అవుతున్నాయి. లేకపోతే వీటికి థియేటర్లు కూడా దొరకవనే విమర్శ వినిపిస్తోంది. ఈ సినిమాలు ఆడించినా భారీ లాస్ త‌ప్ప‌దంటున్నారు. ఇక ఫ్యామిలీలు, స్టూడెంట్స్ తో పాటు ఎవ్వ‌రూ కూడా మార్చిలో సినిమాల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. అందుకే నాని సైతం నెల చివ‌రి వారంలో థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాడు. ఇక నాని వి వ‌చ్చే వ‌ర‌కు థియేట‌ర్ల‌లో నితిన్ భీష్మ‌నే ఆడించ‌నున్నారు. ఓవ‌రాల్‌గా మ‌ర్చిలో రిలీజ్ అవుతోన్న‌ సినిమాలు ఎలా గట్టెక్కుతాయో చూడాలి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: