టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠ పురం లో సినిమాతో తన కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమా టాలీవుడ్లో నాన్ బాహుబలి రికార్డులకు పాత‌రేస్తూ త‌న‌దైన రికార్డు సాధించాడు. ఇక అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోస్ ని తన అభిమానులతో కలిసి పంచుకుంటాడు. బ‌న్నీ త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు పిల్ల‌ల‌తో క‌లిసి ఎంజాయ్ చేసే ఫొటోల‌కు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే లైక్స్‌, కామెంట్స్ మామూలుగా ఉండ‌వు.



సోష‌ల్ మీడియాలో వీటిని బాగా వైర‌ల్ చేస్తూ బ‌న్నీ రోజు రోజుకు భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. తాజాగా బ‌న్నీ త‌న కుమార్తె అర్హ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాడు. అవి బాగా వైర‌ల్ అవుతున్నాయి. అల వైకుంఠపురములోకి ముందు 'నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పు అని బన్నీ అర్హను అడిగితే.. 'నేను చేసుకోను' అని అర్హ ముద్దుగా చెప్పిన మాటలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా బ‌న్నీ అడిగే ప్ర‌శ్న‌ల‌కు అర్హ బే బే అంటూ ఇచ్చిన ఆన్స‌ర్ బాగా వైర‌ల్ అవుతోంది. నాకు ఇష్ట‌మైన క‌ల‌ర్ పింక్ బే, అంటే న‌న్నే బే అంటావా బే అంటూ బ‌న్నీ అర్హ‌తో ఆడుకుంటోన్న వీడియో చూడ‌డానికి బాగానే ఉంది.



అయితే బ‌న్నీ త‌న కూతురుతో ఏకంగా నాలుగు సార్లు బే అని ప‌లికించేశాడు. దీనిపై కొంద‌రు నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఇన్ని బూతులు ప‌లికిస్తూ స‌భ్య స‌మాజానికి... బాల్య స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాల‌నుకుంటున్నావు ? బ‌న్నీ అని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. నీ కూతురుపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని వాళ్లు సూచిస్తున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు, బ‌న్నీ అభిమానులు దీనిని స‌ర‌దాగా తీసుకుంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం బ‌న్నీపై విరుచుకు ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: