ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యంలోనే కాదు ప్రముఖల జీవితాలపై కూడా ఇటీవల బయోపిక్ లు వస్తున్నాయి. అంతే కాదు చారిత్రాత్మక నేపథ్యంలో కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి.  టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ‘క్షణం’ సినిమాతో హీరోగా మారిన అడవి షేషు తర్వాత ‘గుఢాచారి’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి మంచి పేరు వచ్చినా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు.

 

2011 లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించిన అడవి షేషు క్షణం, గూఢాచారి, ఎవరు మూవీస్ లో హీరోగా తన సత్తా చాటాడు.  తాజాగా 2008లో ముంబై టెర్రర్ ఎటాక్ లో ప్రజలను కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా  'మేజర్' సినిమా రూపొందుతోంది. ముంబైలో టెర్రరిస్ట్ ల ఎటాక్ సమయంలో కొంత మంది తీవ్రవాదులతో పోరాడి మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ వీర మరణం పొందారు. తన శరీరంలో బుల్లెట్ దిగినా... శత్రువులతో పోరాడిన ఆయన గురించి అప్పట్లో ఎంతో గొప్పగా చెప్పుకున్నారు.  

 

మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్స్ .. సోనీ పిక్చర్స్ .. ఎ ప్లస్ ఎస్ బ్యానర్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.  'గూఢచారి'లో అడివి శేష్ జోడీ కట్టిన శోభిత ధూళిపాల ఈ మూవీలో హిరోయిన్ గా నటిస్తుంది. బయోపిక్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు అడవిశేషు.

మరింత సమాచారం తెలుసుకోండి: