టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ని నిర్ణయిస్తూ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ తో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాని సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే పవన్ ఫ్యాన్స్ లో ఎంతో సందడి వాతావరణం మొదలయింది. 

 

ఇక కాసేపటి క్రితం అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రావడంతో ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్, దానిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ చస్తున్నారు. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రకాష్ రాజ్ తో పాటు అంజలి, నివేత థామస్, అనన్య ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎస్ ఎస్ థమన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన తొలి సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన పింక్ కు అధికారిక తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ ను ఇటీవల తమిళ్ లో అజిత్ హీరోగా నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి సక్సెస్ ని అందుకుంది. 

 

ఇక ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఒక ఫైట్ ఉంటాయని, సినిమా కథ, కథనాలను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొంత మార్పులు చేర్పులు చేసి దర్శకుడు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నట్లు టాక్. మొత్తానికి ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత నేడు రిలీజ్ అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, పవన్ ఫ్యాన్స్ లో అమితానందాన్ని నింపిందని చెప్పాలి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని మే నెల రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల దిల్ రాజు తెలిపారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: