తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నార్త్ ఇండియన్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. సౌత్ లో చేసిన తొలి సినిమానే ద్విభాషా సినిమా చేసి ఆకట్టుకుంది. తర్వాత ఆమె ఫోకస్ తెలుగులోనే పెట్టింది. మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమా చేసినా ప్రగ్యా జైశ్వాల్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. టాలెంటెడ్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఈ సినిమాలో లభించిన మంచి పాత్రకు తన నటనతో ఆకట్టుకుంది.

 

 

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైశ్వాల్ అప్పుడప్పుడూ తన బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం అమ్మడు పోస్ట్ చేసిన ఓ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సెక్సీ స్విమ్ సూట్ వేసుకుని నీళ్లలో దిగుతూ వయ్యారంగా ప్రగ్యా ఇచ్చిన స్టిల్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మెరిసిపోతున్న ఆమె శరీర చాయకు తగ్గట్టు వేసిన బ్లాక్ స్విమ్ సూట్ లో ప్రగ్యా కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుందనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగా ఆమె చూస్తున్న ఓర చూపు కూడా అంతే అందంగా ఉంది. ‘సాయంత్రపు వేళలో ఆహ్లాదం కోసం’ అనే అర్ధం వచ్చేలా తన వాల్ లో రాసుకుంది.

 

 

ఈ పిక్ ను చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో ప్రగ్యాను పొగిడేస్తున్నారు. ‘ఐ లవ్యూ ప్రగ్యా..’, ‘సూపర్ హాట్ బేబీ’, ‘బ్లాక్ స్విమ్ సూట్ లో సూపర్ సెక్సీ’, ‘నెవర్ ఎక్స్ పెక్టెడ్ బ్యూటీ’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలేమీ లేకపోయినా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. మరి ఈ భామను చూసి దర్శకులెవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Sunset state of mind!! 🧜🏻‍♀🌅

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: