మొన్న సంక్రాంతికి వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమాలో పులొచ్చింది.. మేక సచ్చింది డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం ఇదే డైలాగ్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కే అన్వయిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్. రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని నిన్న ప్రీలుక్ వదిలిన దగ్గర నుంచీ ఒకటే సందడి. పవర్ స్టార్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా నేడు రిలీజ్ అయిన పోస్టర్ వారి అంచనాలను మించి ఉంది. పోస్టర్ లో పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ తో కేక పుట్టించేస్తున్నాడు.

 

 

దీంతో అప్పుడే సోషల్ మీడియా మొత్తం పవన్ నామ జపంతో హోరెత్తిపోతోంది. తన మార్కు స్టైల్ తో కాళ్లు చాపుకుని చేతిలో పుస్తకంతో రఫ్ లుక్ లో ఉన్న పవన్ ను చూస్తూంటే అభిమానులకు పూనకాలే వచ్చేస్తున్నాయి. దిల్ రాజు ఆపీస్ ముందు పవన్ అభిమానులు కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. టీషర్లులపై, ఆటోలపై అప్పుడే వకీల్ సాబ్ స్టిల్స్ పడిపోయాయి. గుబురు గెడ్డంతో, షేడ్స్ పెట్టుకుని ఉన్న పవన్ స్టైల్ అభిమానులను నిలువనీయడం లేదు. అందుకే పవన్ కల్యాణ్ ను స్టైల్ ఐకాన్, ట్రెండ్ సెట్టర్ అంటూ మెగాభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

 

 

పవన్ కల్యాణ్ రూపమే స్టైల్ గా ఉంటుంది. పంజా సినిమాలో విలన్ డెన్ లోకి వెళ్లే సీన్లో ఎటువంటి హావభావాలు లేకుండా పవన్ సింపుల్ గా నడిస్తేనే ఎంత స్టైల్ గా వచ్చిందో.. ప్రస్తుతం ఈ స్టిల్ చూస్తే అదే స్థాయి ఇంపాక్ట్ కలుగుతోంది. మే నెలలో రిలీజ్ కాబోతున్న పవన్ సినిమా.. రెండేళ్ల తర్వాత వస్తూండటంతో వకీల్ సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#VakeelSaabFirstLook #VakeelSaab

A post shared by pawan Kalyan 🌀 (@pawankalyanfans) on

మరింత సమాచారం తెలుసుకోండి: