'సైరా' సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. కాగా సినిమాకి సంబంధించి టైటిల్ మరియు సినిమా స్టోరీ ఇంకా ప్రతి దాని గురించి చాలా గోప్యంగా డైరెక్టర్ ఉంచుతున్నారు. ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించిన టైటిల్ అనుకోని రీతిలో చిరంజీవి రివీల్ చేసేసారు. దీంతో ఒక రకంగా కొరటాల శివ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ముందుగా సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో భారీ ఫంక్షన్ చేసి ప్రమోషన్ అదరగొట్టే రీతిలో చేయాలని సినిమా నిర్మాతలు మరియు డైరెక్టర్ అనుకున్నారంట. కానీ చిరంజీవి ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక పిట్ట కథ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది.

 

ఆ సమయంలో అభిమానులు బాగా హడావుడి చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రసంగంలో ఒక్కసారిగా తను చేస్తున్న సినిమా టైటిల్ ఆచార్య అంటూ చెప్పేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటి వరకు సస్పెన్స్ గా మారిన మూవీ టైటిల్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో 'ఆచార్య' టైటిల్ వైరల్ గా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలలో కొరటాల శివ మిత్రులు కూడా ఉండటంతో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫంక్షన్ చేసే పని లేక పోవడం తో కొరటాల శివ కూడా ఒకరకంగా ఈ పరిణామం వల్ల సూపర్ హ్యాపీ అయినట్లు, డబ్బులు వేస్ట్ అయ్యే పని చిరంజీవి దగ్గరుండి తగ్గించినట్లు కొరటాల ఫీల్ అయినట్లు సమాచారం.

 

మరోపక్క అనుకోకుండా టైటిల్ చెప్పటంతో డైరెక్టర్ కొరటాల శివకి మెగాస్టార్ చిరంజీవి సారీ చెప్పడం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే ‘ఆచార్య’ టైటిల్ ముందు నుండి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మెగా అభిమానులు అంతా ఈ టైటిల్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: