ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు దక్కించుకుంది శృతిహాసన్. తనకంటూ సెపరేట్ మార్కెట్ సౌత్ లో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందచందాలతో క్రియేట్ చేసుకుంది. దక్షిణాది సినిమా రంగంలో దాదాపు చాలా వరకు స్టార్ హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళాక సౌత్ సినిమా అవకాశాలను పక్కన పెట్టింది. అదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చేస్తున్న సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ కావడం మరోపక్క అదే లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖల్ కోర్సేల్ తో డేటింగ్ చేసి తర్వాత అతనితో విడిపోవడం జరిగింది. ఆ సమయంలో వారిద్దరు గురించి అనేక వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో రావడం జరిగింది.

 

ఎక్కడ కూడా సమాధానం చెప్పాని శృతిహాసన్ గత కొంత కాలం నుండి సింగిల్ గా ఉంటుంది. ఇదే తరుణంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావటంతో శృతిహాసన్ పై రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె సర్జరీ చేయించుకుంది ఫేస్ మొత్తం పాడైపోయింది ఎలర్జీ వచ్చింది ఇంకా ఆమె సినిమాలకు పనికిరాదు అంటూ ఐరన్ న్యూస్ బయటకు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి తన హెల్త్ గురించి అన్నీ ఓపెన్ గా చెప్పేసింది.

 

ఆమె మాట్లాడుతూ తాను సర్జరీ చేయించుకున్న మాట నిజమేనని చెప్పేసింది. శారీరకంగా.. మానసికంగా వేధించే హర్మోనల్ సమస్యలు తనకు ఉన్నాయని.. అందుకే తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని ...ఒకప్పుడు భయంకరంగా తాగుతుండేదాన్నని.. కొన్ని కారణాలతో తాగ కూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఫుల్ కాన్సెంట్రేషన్ మొత్తం అంతా హెల్త్ మీద పెట్టినట్లు తాగుడికి దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. అయితే శృతి హాసన్ లో ఇంత మార్పు రావడానికి కారణం అయితే ఆమెకు కొత్త బాయ్ ఫ్రెండ్ ఉండాలి లేకపోతే కెరియర్ కోసమైనా ఇలాంటి మార్పు రావాలి అంటూ మరోపక్క నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: